Wednesday, April 24, 2024

‘రిపబ్లిక్’ ట్రైలర్ ను విడుదల చేసి మెగాస్టార్..

- Advertisement -
- Advertisement -

REPUBLIC Movie Trailer launches by Chiranjeevi

హైదరాబాద్: సాయి ధరమ్ తేజ్, డైరెక్టర్ దేవా కట్టా కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం రిపబ్లిక్. షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఇప్పటికే టీజర్ తోపాటు సాంగ్ ను విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల అయ్యింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి రిపబ్లిక్ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సాయి తేజ్ ఆరోగ్యంపై చిరు అప్డేట్స్ ఇచ్చారు. ”సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. రిపబ్లిక్ చిత్రం అక్టోబర్ 1వ తారీఖున విడుదల చేస్తే బాగుంటుందన్న తన కోరిక మేరకు అదే తేదీన చిత్రం విడుదల అవుతుంది. మీ ఆదరణ, అభిమానం, ప్రేమే సాయి ధరమ్ తేజ్ కి శ్రీరామ రక్ష” అని అన్నారు.

కాగా, ఆసక్తికరమైన సన్నివేశాలు, డైలాగ్స్ తో ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీలో సాయి తేజ్ సరసన ఐశ్వర్యా రాజేష్ నటిస్తుండగా.. రమ్యకృష్ణ, జగపతి బాబు పవర్ ఫుల్ పాత్రల్లో నటిస్తున్నారు.

 

REPUBLIC Movie Trailer launches by Chiranjeevi

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News