Home బిజినెస్ రియల్‌కు ‘రెరా’ భయం

రియల్‌కు ‘రెరా’ భయం

RERA

హైదరాబాద్: రియల్ ఎస్టేట్ వ్యాపా రులకు “రెరా”(రియల్ ఎస్టేట్ రెగ్యూలేటరీ అథారిటీ) భయం పట్టుకుంది. రెరా చట్టం అమలులోనికి రా కముందే కొందరు రియల్ వ్యాపారులు కొత్త ప్రాజెక్ట్‌లను చేపట్టేందుకు ఆసక్తిచూపడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే రెరా చట్టాన్ని అమలు చేసే అవకాశాలు ఉన్నం దున దీనికి సంబంధించిన సమగ్ర విధి విధానాలు వచ్చిన తర్వాతనే కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాలని యోచిస్తు న్నట్లు తెలుస్తోంది. నిబంధనలను అతిక్రమిస్తే నిర్మాణదా రులు జైలుకు పోయే ప్రమాదం, భారీ జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ చట్టాన్ని ఇతర రాష్ట్రాలలో అమలు చేస్తున్నారు. ఇటీవల ఈ చట్టానికి సం బంధించిన ముసాయిదాను సిద్ధం చేసిన పురపాలక శాఖ ప్రభుత్వం అనుమతి కోసం పంపింది. అయితే ఈ చట్టం పరిధిలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లు కూడా వస్తాయా..? లేదా పాత వాటిని మినమాయిస్తారా..? అనే అంశంపై రియల్ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. రెరా చట్టాన్ని అమలు చేసినప్పటికీ ప్రస్తుతం నిర్మా ణంలో ఉన్న ప్రాజెక్టులను రెరా చట్టం పరిధిలోనికి తీసుకు రావొద్దని ఇది వరకే కొందరు రియల్ వ్యాపారులుపుర పాలక శాఖను కోరినట్లు తెలిసింది. పైగా ఇందులో కొన్ని అంశాలపై కొంత వరకు సవరణలు తీసుకురావాలనే విష యమై కూడా వారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. కాగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని రేరాకు సంబంధించిన ముసాయిదాను సిద్ధం చేశారు. దీనిపై ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ రావడమే తరువాయి తక్షణమే అమలు చేయాలని పురపాలక శాఖ భావిస్తున్న ది. అయితే కర్నాటక ప్రాంతంలో 60 శాతం పూర్తయిన నిర్మాణాలను రేరా చట్టం నుంచి మినహాయిస్తూ అక్కడి రాష్ట్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ అంశాన్ని కూడా రియల్ వ్యాపారులు ప్రస్తా విస్తున్నారు. రేరా చట్టం అమలులోనికి వస్తే చిన్న పాటి రియల్ వ్యాపా రుల పరిస్థితి కొంత కష్టతరంగానే ఉంటుందనే అభిప్రా యాలు వ్యక్తం అవుతున్నాయి. నిర్మాణదారులు ముందుగా తమ ప్రాజెక్ట్ పొందపరుస్తున్న సౌకర్యాలను పూర్తి చేస్తేనే ఆక్యూపెన్సీ సర్టిఫెకెట్ ఇస్తారు. ఒక వేళ వాటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకునే వెసులుబాటు ఉన్నది. దీంతో పార్కింగ్, తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సిందేనని పలువురు పేర్కొంటున్నారు. నిబంధనల అమలు విషయం ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పనులను కూడా రేరా పరిధిలోనికి తీసుకొస్తారా..? లేదా మినహా యింపు ఇస్తారా అనేది ప్రస్తుతం రియల్ వ్యాపారుల్లో ఆం దోళన చెందుతున్నారు.
కొత్త నిర్మాణాలు 41శాతమే : నైట్‌ఫ్రాంక్
దేశ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంపై నోట్ల రద్దు, రెరా(రియల్ ఎస్టేట్ రెగ్యూలేటరీ అథారిటీ) ప్రభావంతో కొత్త నిర్మాణాలు కేవలం 41 శాతం మాత్రమే నమోద య్యాయని నైట్‌ఫ్రాంక్ సంస్థ వెల్లడించింది. హైదరాబా ద్‌లో 56 శాతం కొత్త కట్టడాలు నమోదు కాగా, అందులో పశ్చిమ ప్రాంతంలోనే 80 శాతం ఉండగా, ఇందులో 69 శాతం అమ్మకాలు జరిగాయి. ప్రధానంగా ఐటి రంగానికి సంబంధించిన వాణిజ్య నిర్మాణాలకు డిమాండ్‌కు తగిన ట్లుగా నిర్మాణాలు అందుబాటులో లేవని ఆ నివేదికలో పేర్కొన్నారు. హైదరాబాద్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నైట్‌ఫ్రాంక్ సంస్థ డైరక్టర్ గులంజియా, హైదరాబాద్ శాఖ ప్రతినిధి శాంసన్ ఆర్థర్ దేశ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన ఆరు నెలల (2017 జనవరి నుంచి జూన్) నివేదికను వెల్లడిం చారు. రూ. 50 లక్షల లోపు ఇళ్లకు మాత్రం 71 శాతం పెరిగాయని, ఇది మెల్లమెల్లగా మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. రూ. 1 కోటికి పైబడిన కట్టడా లపై పెద్దగా స్పందన కనిపించడం లేదని, దీంతో చాలా మంది రూ. 50లక్షల లోపు నిర్మాణాలపై అమితాసక్తి చూపుతున్నారని వారు వివరించారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ ధరలు స్థిరంగానే ఉన్నాయని, సమీప భవిష్యత్తులో కూడా ఇదే ధరలు కొనసాగే అవకాశం ఉందని, వాణిజ్య వ్యాపారం 44 శాతం పడిపోయింద న్నారు. లావాదేవీలు కూడా పడిపోయాయని, ఇతర సేవా రంగాలకు సంబంధించిన నిర్మాణాలు 22.5 శాతానికి పెరిగాయని వివరించారు. హైదరాబాద్‌లో అద్దెలు మాత్రం 14 శాతం పెరిగాయ న్నారు. ముంబయి, బెంగళూరు మ ధ్య తరగతి ఇళ్లకు మంచి స్పందన ఉందన్నారు. అమ్మ కాలు కొంత మేరకు పర్వాలేదన్నారు. టాప్ 8 నగరాల్లో (అహ్మదాబాద్, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్, కొల్ కత్తా, ముంబై, పూణే, దేశ రాజధాని అనుబంధ ప్రాంతా లు-ఎన్‌సిఆర్) కొత్త నిర్మాణాలు తగ్గాయని తెలిపారు.