Home రాష్ట్ర వార్తలు పదోన్నతులలో బిసిలకు రిజర్వేషన్లు

పదోన్నతులలో బిసిలకు రిజర్వేషన్లు

jgrmn

 మంత్రి జోగు రామన్న
హైదరాబాద్: బిసి ఉద్యోగులకు పదోన్నుతలలో రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న అన్నారు. ఇతర ఉద్యోగ సంఘాలమాదిరిగా బిసి ఉద్యోగ సంఘాలకు, ఉపాధ్యాయ సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఫ్యాప్సీ ఆడిటోరియంలో ఆదివారం “బిసి ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర మహాసభ” జరిగింది. ఈ సభకు మంత్రి జోగురామన్న ముఖ్య అతిథిగా హాజరుకాగా ఎంపి బండారు దత్తాత్రేయ, పిసిసి మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, బిసి కమిషన ఛైర్మన్ బి.ఎస్. రా ములు, జస్టిస్ ఈశ్వరయ్య, బిసి కమిషన్ రాష్ట్ర సభ్యులు వి.కృష్ణమోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోగురామన్న మాట్లాడుతూ విద్య, సామాజిక, ఆర్థిక రాజకీయ రంగాలలో బిసిలకు సమాన వాటా దక్కాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదన్నారు. బిసిలపై ప లు అంశాలపై చర్చించి రూపొందించిన నివేదిక ను ముఖ్యమంత్రి కెసిఆర్‌కు అందజేశామని చెప్పారు. పారిశ్రామిక విధానంలో బిసిలకు ఆర్థికంగా చేయూత నిచ్చేందుకు వీలుగా బిక్కి అనే సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పునరుద్ఘాటించారు. బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ ఎవరెన్ని అడ్డంకులను సృష్టించినా పార్లమెంట్ సమావేశాల్లో బిసి కమిషన్ బిల్లు ఆమోదం పొందుతుందన్నారు. బిసి ప్రధాన డిమాండ్లపై బిసి ఉద్యోగుల మార్చి నెలలో కేంద్ర ఆర్థికమం త్రి అరుణ్‌జైట్లి తో సమావేశాన్ని ఏర్పాటు చేయిస్తామన్నారు. పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ పదోన్నతులలో రిజర్వేషన్ల విషయంలో జాతీయ స్థాయిలో మద్దతునిస్తుందన్నారు. అన్ని పార్టీలు బిసి రాజకీయ పాలసీని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ మాట్లాడుతూ బిసి డిమాండ్లపై తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. రాష్ట్ర బిసి కమిషన్ బి.ఎస్.రాములు మాట్లాడుతూ బిసి రిజర్వేషన్ల పెంపుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. బిసి ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుంకరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సురేష్, నేతలు ఇ.నిరంజన్, కుల్కచర్ల శ్రీనివాస్, దుర్గయ్య, వినోద్ పాల్గొన్నారు.