గూగుల్… ప్రపంచంలోనే పెద్ద పెద్ద కంపెనీలకు సైతం సవాల్ విసురుతూ వర్కింగ్ స్టైల్ లోనూ వైవిధ్యాన్ని చూపిస్తున్న కంపెనీ. ఈ రోజుల్లో గూగుల్ గురించి తెలియనివాళ్లుండరు. ఇంటర్నెట్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి ముందుగా పరిచయమయ్యేది గూగులే.
ఆ ఆకర్షణతోనే కావచ్చు… ఓ ఏడేళ్ల అమ్మాయి గూగుల్ లో జాబ్ కోసం ఓ లెటర్ రాసింది. మామూలుగా జాబ్ కోసం రెజ్యూమె ప్రిపేర్ చేసి ఎలా పంపిస్తారో.. అచ్చం అలాగే ఓ లెటర్ రాసి తన అభిరుచులు, తన బయోడేటా మొత్తం వివరించింది.
పెద్దయ్యాక గూగుల్ లో జాబ్ చేయాలనుకుంటున్నానని, స్విమ్మింగ్ లో ఒలంపిక్స్ కూడా సాధించడం తన కోరికలని చెప్పింది. ఇంకా…తనకు కంప్యూటర్స్, రోబోట్స్ అంటే ఇష్టమని పెద్దయ్యాక గూగుల్ లో జాబ్ చేయాలంటే కంప్యూటర్ స్కిల్స్ నేర్చుకోవాలని తన డాడి చెప్పాడని వివరించింది. తన లెటర్ మీరూ చదవండి ఓ సారి….
చదివారుగా… ఎంత క్యూట్ గా, ఎంత పరిణితితో లెటర్ రాసిందో… సాధారణంగా కొన్ని లెటర్స్ కు మల్టీ నేషనల్ కంపెనీలు రెస్పాన్స్ ఇవ్వవు. కాని, ఈ లెటర్ గూగుల్ సిఇవో ను ఆకర్షించడంతో.. సుందర్ పిచయ్ కూడా ఆ అమ్మాయి కి రిప్లై లెటర్ పంపించాడు.
“లెటర్ పంపించినందుకు చాలా థ్యాంక్స్…కంప్యూటర్స్, రోబోట్స్ అంటే నీకు ఇష్టంగా ఉండటం చాలా సంతోషంగా ఉంది. అలాగే నేర్చుకుంటూ ఉండూ… ఖచ్చితంగా నీ కలలను చేరుకుంటావు. నీ స్కూలింగ్ అయిపోయాక.. గూగుల్ లో జాబ్ కోసం వచ్చే నీ అప్లికేషన్ కోసం వేచి చూస్తుంటాను…” అంటూ గూగుల్ సిఇవో సుందర్ పిచాయ్ కూడా రిప్లై ఇచ్చాడు.
సుందర్ పిచాయ్ పంపిన లెటర్ కూడా చదవండి మరి…