Home తాజా వార్తలు తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం

తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం

Retail inflation dips marginally to 6.69% in Aug

ఆగస్టులో 6.73% నుండి 6.69 శాతానికి దిగొచ్చింది

న్యూఢిల్లీ : ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం విషయంలో కొంత ఊరట లభించింది. కానీ కూరగాయల ద్రవ్యోల్బణం మాత్రం పెరిగింది. జూలైతో పోలిస్తే ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గింది. సిపిఐ (వినిమయ ధర సూచీ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో 6.69 శాతం నమోదవగా, జూలైలో ఇది 6.73 శాతంగా ఉంది. అదే సమయంలో వినియోగదారుల ఆహార ధరల సూచీ అంటే ఆహార ద్రవ్యోల్బణం 9.05 శాతానికి పడిపోయింది. అయితే కూరగాయల ద్రవ్యోల్బణ రేటు 11.29 శాతం నుంచి 11.41 శాతానికి పెరిగింది.

ఇంధన-, విద్యుత్ ద్రవ్యోల్బణం కూడా పెరిగింది. అయితే తృణధాన్యాలు, పప్పుధాన్యాల ద్రవ్యోల్బణం క్షీణించింది. ఇంధన-విద్యుత్ ద్రవ్యోల్బణం జూలైలో 2.80 శాతం నుండి 3.10 శాతానికి పెరిగింది. దుస్తులు, పాదరక్షల ద్రవ్యోల్బణ రేటు జూలైలో 2.91 శాతం నుండి 2.77 శాతానికి తగ్గింది. తృణధాన్యాల ద్రవ్యోల్బణం ఆగస్టులో 5.92 శాతానికి పడిపోయింది. జూలైలో ఇది 6.96 శాతంగా ఉంది. అదే సమయంలో పప్పుధాన్యాల ద్రవ్యోల్బణ రేటు జూలైలో 15.92 శాతం నుండి 14.44 శాతానికి తగ్గింది.

Retail inflation dips marginally to 6.69% in Aug