Home జగిత్యాల బాలికపై రిటైర్డ్ టీచర్ అత్యాచారం?

బాలికపై రిటైర్డ్ టీచర్ అత్యాచారం?

rape

 

నాలుగు నెలల గర్భం దాల్చిన బాలిక

జగిత్యాల : జగిత్యాల జిల్లా కేంద్రంలోని పురాణిపేటకు చెందిన ఓ మైనర్ బాలికపై అదే ప్రాంతానికి చెందిన వరుసకు తాత అయిన ఓ రిటైర్డ్ టీచర్ అత్యాచారానికి ఒడిగట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. జిల్లా కేంద్రానికి చెందిన ఓ బాలిక సారంగాపూర్ మండలంలోని కస్తూరిభా గాంధీ విద్యాలయంలో చదువుకుంటోంది. బాలిక గత కొద్ది రోజులుగా అనారోగ్యంగా ఉండటంతో పాటు ఆమె శరీరంలో మార్పులు రావడాన్ని గమనించి పాఠశాల ప్రిన్సిపల్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి పాపను ఇంటికి తీసుకెళ్లాలని సూచించింది. దాంతో వారం క్రితం తల్లి వెళ్లి తన కూతురును జగిత్యాలకు తీసుకొచ్చి ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించింది. పరీక్షలు నిర్వహించిన వైద్యులు బాలిక నాలుగు నెలల గర్భవతి అని దృవీకరించారు.

దాంతో తీవ్ర ఆందోళకు గురైన తల్లి ఎలా జరిగిందని ప్రశ్నించడతో బాలిక అసలు విషయాన్ని వివరించింది. గత వేసవి సెలవుల్లో పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన బాలికను తమ ఇంటి పక్కన ఉండే వరుసకు తాత అయిన ఓ రిటైర్డ్ టీచర్ వంట చేసేందుకు రమ్మని పిలిచి రెండు సార్లు అమెపై బలవంతంగా అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని బాలిక వివరించడంతో కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు తమ బిడ్డ భవిష్యత్తు నాశనం చేసిన సదరు రిటైర్డ్ టీచర్‌ను నిలదీశారు. ఈ విషయం బంధువులకు తెలియడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించగా శనివారం బాలికను తీసుకుని తల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుంది. కాగా అప్పటికే బాలిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపిస్తున్న రిటైర్ట్ టీచర్ తనకు ఏ పాపం తెలియదని, తనపై కావాలని అభాండం మోపుతున్నారని, తన ఆస్తిని కాజేసేందుకే తనపై నింద మోపుతున్నారని ఆరోపిస్తూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

కాగా బాధిత బాలిక మాట్లాడుతూ, వేసవి సెలవుల కోసం ఇంటికి వచ్చిన తనపై తాతయ్య తన ఇంటికి పిలిపించుకుని బలవంతంగా రెండు సార్లు అత్యాచారం చేశాడని, ఈ విషయం ఎవరికైనా చెబితే కుటుంబాన్ని హతమారుస్తారనని బెదిరించాడని తెలిపింది. ఆ తర్వాత హాస్టల్‌కు ఫోన్ చేసి ఎప్పుడు వస్తావు… వచ్చినప్పుడు మా ఇంటికి రావాలంటూ కోరాడని పేర్కొంది. తనపై దురుద్దేశ పూర్వకంగానే తప్పుడు ఆరోపణ చేస్తున్నారని, ఏ పరీక్షకైనా సిద్దమేనని సదరు వ్యక్తి పోలీస్‌స్టేషన్‌లో లిఖితపూర్వక ఫిర్యాదు చేయగా, బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Retired teacher rape on girl?