Friday, April 19, 2024

జరీన్ ను గ్రూప్-1 అధికారిగా నియమించాలి

- Advertisement -
- Advertisement -

జరీన్ స్పోర్ట్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం స్థలాన్ని కేటాయించాలి
సన్మాన కార్యక్రమంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ విజ్ఞప్తి
జనవరి 26లోగా జరీన్ ను గ్రూప్-1 అధికారిగా నియమించాలి
హైదరాబాద్: రాష్ట్రంలో స్పోర్ట్ అకాడమీ ఏర్పాటుకు నిఖత్ జరీన్‌కు ప్రభుత్వం స్థలాన్ని కేటాయించాలని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అన్ని రకాల సౌకర్యాలతో స్పోర్ట్ అకాడమీ ఏర్పాటు చేయాలన్నారు. పిసిసి ఆధ్వర్యంలో నిజాంక్లబ్‌లో ఏర్పాటు చేసిన బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. కాంగ్రెస్ నేతలతో కలిసి జరీన్ ను సన్మానించారు. జరీన్ ను గ్రూప్1 ఆఫీసర్ గా నియమించాలనే ప్రతిపాదన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉందని, అయితే జనవరి 26లోగా జరీన్‌కు గ్రూప్1 అధికారిగా నియమించాలని కోరారు. జరీన్ సాధించిన విజయాన్ని గౌరవిస్తూ పార్టీ తరపున రూ.5 లక్షలు బహుమతిగా ప్రకటించామని ఆయన తెలిపారు.

జరీన్‌కు కాంగ్రెస్ అండగా ఉంటుందని, తామంతా జరీన్‌తో ఉన్నామని చెప్పేందుకే బహుమతిని ప్రకటించామన్నారు. రాజకీయాలకు అతీతంగా క్రీడాకారులను ప్రోత్సహించేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని చెప్పారు. రాజకీయాల్లోనూ క్రీడా స్ఫూర్తి అవసరమన్నారు. ఆ క్రీడా స్ఫూర్తిని కలిగించేందుకే ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నిఖత్ జరీన్‌ను కుటుంబ సభ్యులు ఎంతో ప్రోత్సహించారని, ఇందుకు వారికి అభినందనలు చెప్పాలన్నారు. లక్షలాదిమంది విద్యార్థులకు క్రీడా స్ఫూర్తిని కలిగించేలా మరోసారి నిఖత్‌కు గొప్పగా సన్మానించేలా కార్యక్రమం నిర్వహించుకోవాల్సినవసరం ఉందన్నారు. తనకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడంపై బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. బహుమతిని ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారం ఉంటే క్రీడల్లో దేశం గర్వించేలా ముందుకెళతానని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News