Saturday, April 20, 2024

బిజెపి నాయకులను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన రేవంత్..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: పార్టీని వీడిన వారంతా తిరిగి రావాలని, అవసరమైతే తాను ఓ మెట్టు దిగుతానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. గాంధీ భవన్ లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌ను గద్దెదించేందుకు కలిసి పోరాటం చేద్దామని ఆయన కోరారు. బిజెపి నాయకులు వివేక్ వెంకటస్వామి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్, కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితోపాటు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి సహా పార్టీ నుండి ఇతర పార్టీల్లో చేరిన నేతలంతా కాంగ్రెస్ లోకి రావాలని కోరారు.

పార్టీని వీడిన నాయకులతో తనకు ఏమైనా అవమానాలు జరిగినా తనకు ఇబ్బంది లేదన్నారు. అవసరమైతే తాను ఓ మెట్టు దిగుతానని ఆయన చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుక తమతో కలిసి రావాలని కోరారు. తానే మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో పనిచేస్తున్నానని రేవంత్ రెడ్డి చెప్పారు. తనతో ఇబ్బంది అనుకుంటే పార్టీలో ఉన్న ఇతర సీనియర్లతో చర్చించాలని కూడా కోరారు. కాంగ్రెస్ పార్టీ అమ్మ వంటిందన్నారు. అందరూ ఆదరించాలని ఆయన కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News