- Advertisement -
హైదరాబాద్ : తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి ఆంధ్రా పార్టీ వదిలి వెళ్లిన అవశేషమని మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించారు. మంగళవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతున్న సమయంలో రేవంత్ అడ్డుతగలడంతో ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘అధ్యక్షా చిలక మనదే కానీ.. పలుకులు మాత్రం పరాయిది’ అని ఎద్దేవా చేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు బ్రిటీష్ వారు కొన్ని అవశేషాలు వదిలి వెళ్లినట్టు తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్రా వాళ్లు వదిలెళ్లిన అవశేషం రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు. వాళ్ల నాయకుడు తెలంగాణ వదిలి వెళ్లిపోయినా వీళ్లు మాత్రం ఇంకా ఆయనపై ఇక్కడ ప్రేమ వలకబోస్తున్నారని విమర్శించారు.
- Advertisement -