Home మంచిర్యాల రెవెన్యూ శాఖ హెచ్చరికలు బేఖాతర్

రెవెన్యూ శాఖ హెచ్చరికలు బేఖాతర్

సోమగూడెంలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణం
చర్యలు చేపడతామన్న తహసీల్దార్ సురేష్

House1

కాసిపేట: సోమగూడెం సమీపంలోని 3పైకి సర్వే నెం బర్ ప్రభుత్వ భూమి అని ఇక్కడ కట్టడాలు నిర్మిస్తే కూల్చివేస్తామని రెవెన్యూ శాఖ చేసిన హెచ్చరికలను భేఖాతర్ చేస్తు అక్కడ అక్రమ కట్టడం నిర్మాణం కొనసాగుతండడం చర్చనీయాంశమైంది. బెల్లంపల్లి రెవెన్యూ దివిజన్ పరిదిలోని ఆకెనపల్లి శివారు 3పైకి సర్వేనెంబర్ భూమిని ప్రభు త్వ భూమిగా గుర్తిస్తు అక్కడ ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాలాయం కొరకు సన్నాహాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో అక్కడ అక్రమ నిర్మాణం వెలియ డంతో స్పందించిన బెల్లంపల్లి తహసీల్దార్ సురేష్ నేతృత్వంలో కాసిపేట పోలీసుల బందోబస్తు మధ్య అక్రమ కట్టాడాన్ని రెవెన్యు సిబ్బంది కూల్చి వేసారు.

అక్కడ ఇది ప్రభుత్వ భూమి అని బోర్డును కూడా ఏర్పాటు చేసా రు. కొన్ని రోజులు స్థబ్దదగా వుండి మళ్లీ ఇటీవల గత శనివారం అక్కడ నిర్మాణం చేపట్టగా తహాసిల్దార్ ఆదేశాల మేరకు  రెవెన్యూ శాఖ విఆర్‌వో లక్ష్మణ్ తిరిగి మరలా అక్కడ బోర్డును ఏర్పాటు చేసారు. అయినప్పటికి మళ్లీ ఐదురోజుల సమయంలోనే గురువారం ప్రభుత్వ బోర్డు వుండగానే మళ్లీ నిర్మాణం చేపట్టడం సంచలనం సృష్టించింది. ఇదిలా వుండా సామా న్యులు కట్టుకుంటే ఆగమేఘాల మీద వచ్చి కట్టడాలను కూల్చి వేసే రెవె న్యూ అధికారులు, సిబ్బంది ఇక్కడ బహిరంగంగా పలు మార్లు కట్టాడాలు చేపడుతున్న రెవెన్యు శాఖ పట్టించుకోకపోవడం పట్ల పలువురు పలు అనూమానాలను వ్యక్తం చేస్తున్నారు.

గుడిసెను పీకి వేసే అధికారులు బహిరంగంగా భవనం నిర్మిస్తున్న పట్టించుకోకపోవడం విమర్శలకు తావి స్తోంది. ఈ విషయమై బెల్లంపల్లి తహాసిల్దార్ సురేష్‌ను వివరణ కొరగా సోమగూడెంలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణం విషయంలో చర్యలు చేపడ తామని, అక్రమాలకు పాల్పడేవారిలో ఎంతవారైనా వదిలేది లేదని, అక్ర మ నిర్మాణాన్ని అడ్డుకుంటామని ఆయన తెలిపారు.