Home మహబూబాబాద్ విదులపట్ల ఇంత నిర్లక్ష్యమా..

విదులపట్ల ఇంత నిర్లక్ష్యమా..

Revenue Officers Doing Neglency In Thier Duty

మన తెలంగాణ / కొత్తగూడ : ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాలలో నెలకొని ఉన్న ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు విధులు నిర్వర్తించే పంచాయతీ కార్యదర్శులు వారి విధుల పట్ల ఇంత నిర్లక్షమా..? అని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గ్రామ పంచాయతీ పరిధి గ్రామాల లబ్ధిదారులు తమ తమ అవసరాలకు కావలసిన సర్టిఫికెట్స్‌పై కార్యదర్శిల సంతకం చేయించుకునేందుకు నానా ఇబ్బందులు తప్పవని పలువురు వాపోతున్నారు. ఓ వైపు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం ఇంటింటా మరుగుదొడ్డి నిర్మించాలనే దృఢ సంకల్పంతో ప్రవేశ పెట్టిన పథకం వీరి కమిషన్‌ల కక్కుర్తితో లబ్ధిదారులు తంటాలుపడుతున్నారు. కళ్యాణ లక్ష్మీ, మరుగుదొడ్డి నిర్మాణం లబ్ధిదారులు ప్రభుత్వ లబ్ధ్ది పొందాలంటే చేసే ప్రతి సంతకానికి ఓ ధర నిర్ణయిస్తున్నారని మరి కొందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంతకాల కోసం చూసే లబ్ధిదారులు వీరి కోసం ఆయా గ్రామ సచివాలాయాల ముందు పడికాపులు కాస్తున్నారు. వారిని  లబ్ధిదారులు ప్రశ్నిస్తే దురుసు సమాధానం ఇస్తూ మేము మరొక గ్రామ పంచాయతీలో పని చేస్తున్నామన్న సాకులు సైతం ఉన్నాయని చెబుతున్నారు. పింఛన్ పొందాలన్న, కులాయి బాకాయిలకు, నల్లా బిల్లులకు ముడి పెట్టడంతో వృద్ధులు సైతం ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు. మంగళవారం మండల కేంద్రంలోని గ్రామ సచివాలయాన్ని సంప్రదించిన లబ్ధిదారులు పంచాయతీ కార్యదర్శి అందుబాటులో లేకపోవడంతో సోషల్ మీడియాలో మధ్యాహ్నం వేళ అవుతున్న హజరుకానీ కార్యదర్శి పోస్టు చేయడంతో సదరు కార్యదర్శి హుటాహుటిన తాను విధులు నిర్వర్తించే మరొక గ్రామ పంచాయతీకి వెళ్ళి అక్కడ విధుల్లో ఉన్నట్లు ఫొటోలు పోస్టుచేయడమే వారి నిర్లక్ష్యానికి నిదర్శనం. ఏదేమైన పంచాయతీ కార్యదర్శులు గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండేలా చొరవ చూపాలని, విధులకు హాజరుకానీ కార్యదర్శిలపై శాఖ పరమున చర్యతీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.