Thursday, April 25, 2024

పెద్దగట్టు జాతర నిర్వహణ ఏర్పాట్ల పై మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష..

- Advertisement -
- Advertisement -

 

 

సూర్యాపేట : ఏ ఒక్క భక్తుడికి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 వ తేదీ నుండి 9 వరకు జరుగనున్న గట్టు జాతర రాష్టం లో రెండవ అతి పెద్ద జాతర అయిన దురాజ్ పల్లి పెద్ద గట్టు జాతర ఏర్పాట్లపై శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణ, త్రాగునీరు, లైటింగ్, మరుగుదొడ్లు, పారిశుద్ధ్య నిర్వహణ పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

దురాజ్ పల్లి పెద్దగట్టు మహాజాతరకు 15 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నామని చెప్పారు. వచ్చే ప్రతీ భక్తుడికి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఎక్కువ మంది రానున్న నేపథ్యం లో జాతీయ రహదారి పై ట్రాఫిక్ సమస్య రాకుండా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ కు మంత్రి సూచించారు..అదే విధంగా భక్తుల రద్దీ ని దృష్టిలో ఉంచుకుని త్రాగు నీరు సమస్య రాకుండా మిషన్ కాకతీయ ద్వారా సరిపడా నీటిని అందించాలని ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. అంటు వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టంగా పారిశుద్ధ్య నిర్వహణ ను చేపట్టాలని మున్సిపల్ అధికారులను కోరారు. లైటింగ్ , మరుగుదొడ్ల వంటి సౌకర్యాలు కల్పించాలని, భక్తులు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పడకూడదని మంత్రి అధికారుల ను కోరారు.

ఇక ఇక్కడికి వచ్చే భక్తులు ఒక రోజు మొత్తం ఉండే సంప్రదాయం ఉండటం తో రైతుల కు పంట పరిహారం అందజేసి 150 ఎకరాలు సేకరించామని మంత్రి అన్నారు.గతం లో నీరు లేక గట్టు పరిసర భూములు బీడు భూములు గా ఉండటం తో భక్తులు అందులో బస చేసే వారని, కానీ ప్రస్తుతం కాళేశ్వరం జలాలు వస్తుండటం పెద్ద గట్టు పరిసరాలు పంట పొలాలు గా మారిపోయిన నేపథ్యం లో భక్తుల సౌకర్యం కోసం రైతుల ను ఒప్పించి 150 ఎకరాలను సేకరించడం జరిగిందన్నారు.. ఈ సమీక్ష సమావేశం లో ఎంపి బడుగుల తో పాటు పెద్ద గట్టు చైర్మన్ కోడి సైదులు యాదవ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాళ అన్నపూర్ణ, గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్ తదితరుల పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News