Home నిజామాబాద్ కేంద్ర పథకాల అమలుపై సమీక్ష

కేంద్ర పథకాల అమలుపై సమీక్ష

kavi*పంట నష్టాన్ని సర్వే చేసి సత్వరమే నివేదిక పంపాలి
*నిజామాబాద్ ఎంపి కవిత

మనతెలంగాణ/నిజామాబాద్‌బ్యూరో
జిల్లాలో అకాల వర్షాల వల్ల, దోమకాటుకు గురై వరిపంట నష్టం జరిగినందున ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా రైతులను ఆదుకునేందు కు పంటనష్టాన్ని సర్వే చేసి సత్వరమే ప్రభుత్వానికి నివేదిక పంపాలని నిజా మాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అధికారులను ఆదేశిం చారు. మంగళవారం ప్రగతిభవన్‌లో కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు జరుగు తున్న పథకాలను సమీక్షించే దిశా సమావేశం ఎంపి అధ్యక్షతన జరిగింది. ఈ సందరంగా ఎంపీ మాట్లాడుతూ జిల్లాలో దోమకాటుకు, అకాల వర్షాల వల్ల వరిపంట నష్టానికి గురైన రైతులను ఆదుకునేందుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. పంటనష్ట సర్వే రెవెన్యూ వ్యవసాయ మండల బీమా సంస్థ లచే సర్వే పూర్తి చేసినందున ప్రభుత్వానికి సత్వరమే నివేదించాలని పంట నష్ట పోయిన రైతులకు మంజూరైన పరిహారం 3 రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించారు. సబ్సిడీ కింద విడుదలైన నిధులు కూడా ఇంకా కొంద రి రైతులకు వారివారి ఖాతాలో జమ కాలేదని ఆరోపణలు వస్తున్న దృష్టా బ్యాంకు వద్దకు వెళ్లి రైతుల ఖాతాలను పరిశీలించాలని సూచించారు. ప్రభుత్వా సుపత్రిలో రోగుల నుండి, రోగుల బంధువుల నుండి వైద్య సిబ్బంది డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు వస్తే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసకోవాలన్నారు. ప్రైవేట్ ఆసుపత్రిల్లో డెలివరీ అయిన సందర్భంగా పిల్లలకు ఇచ్చే ఇమ్యునైజేషన్ ప్రక్రియను తప్పనిసరిగా చేయాలని ఆదేశించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇమ్యు నైజేషన్ ప్రక్రియ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏలా జరుగుతుందో పరిశీలించాలని డిఎంహెచ్‌ఓను ఆదేశించారు. ఈ విషయంలో సహకరించని ఆసుపత్రులపై నిర్దేశించిన ప్రకారంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పారిశుద్దం, ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో వివిధ రకాల సేవలకు ఖర్చు చేసే వివరాల ప్రభు త్వం నిర్దేశించిన ప్రకారం జరగాలని ఆదేశించారు. మధ్యాహ్న బోజన పథకం లో నిర్దేశించిన ప్రకారంగా విద్యార్థులకు గుడ్లు సరఫరా చేయాలని, గుడ్ల ధర లు పెరిగినందున కొన్ని పాఠశాలలో విద్యార్థులకు గుడ్లు పెట్టడం లేదని ఆరోపణలు వస్తున్నందున తప్పనిసరిగా నిర్దేశించిన ప్రకారంగా విద్యార్థులకు గుడ్లను సరఫరా చేయాలన్నారు. ఆర్మూర్, బోధన్, నిజామాబాద్‌లో వచ్చిన ప్రదేశాల్లో మరుగుదొడ్లను నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. పెట్రోల్‌బంక్‌లు, వాణిజ్య సముదాయాల చోట తప్పని సరిగా మరుగుదొడ్డి ఉండే విధంగా చర్యలు తీసుకోవాల న్నారు.  ఉపాధి హామీ పనులు గ్రామ  పంచాయతీ ద్వారానే జరుగుతా యని జిల్లాకు మంజూరైన భవనాలు పనిచేసే  ఏజెన్సీకి అప్పజెప్పిన నిధులు మాత్రం గ్రామ పంచాయతీ  ఖాతాలో ఉంటాయన్నారు. గ్రామ పంచాయతీ భవనాలకు రూ.13 లక్షల సరిపోవడం లేదని నిధులు పెం చాలనే సభ్యులు ఎంపిని కోరగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. ప్రభుత్వ నిర్దేశించిన ప్లాన్ ప్రకారం భవనాన్ని నిర్మిస్తే ఇబ్బందులు ఉండవని ఎక్కువగా విస్తీర్ణంలో భవనం నిర్మిస్తే మిగతా నిధులు సంబంధిత ఎమ్మెల్యే ఫండ్‌ల నుండి తీసుకోవాలని సూచించా రు. స్మశాన వాటికల వాటిలో నీటి వసతి అదే స్థలంలో కొంత దూర ప్రా ంతంలో కల్పించాలన్నారు. కబరాస్థాన్ మరమ్మతులు ఇతర పనుల కోసం రూ.8 కోట్లు మంజూరయ్యాయని ఎంపీ వివరించారు. ఈ కార్య క్రమంలో నగరమేయర్ ఆకుల సుజాత, ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త, డిసిసిబి చైర్మన్ గంగాధర్ పట్వారీ, అధికారులు, ఎంపిడిఓలు, జడ్పి టిసి, మార్కెట్ కమిటీ చైర్మన్‌లు పాల్గొన్నారు.