Tuesday, April 23, 2024

రియాకు మళ్లీ చుక్కెదురు..

- Advertisement -
- Advertisement -

రియాకు మళ్లీ చుక్కెదురు
జ్యుడిషియల్ కస్టడీ వచ్చే నెల 6వరకు పొడిగింపు

ముంబయి: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు, డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయని అభియోగాలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తికి మరోసారి చుక్కెదురైంది. ఆమె జ్యుడిషియల్ కస్టడీని అక్టోబర్ 6 వరకు పొడిగిస్తూ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. డ్రగ్స్ కేసులో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసిన మిగతా నిందితులను రేపు కోర్టులో ప్రవేశపెడుతామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ సర్పందే తెలిపారు. నిందితుల్లో రియా సోదరుడు షోవిక్ కూడా ఉన్నారు. కాగా, సెప్టెంబర్ 11న రియా, మిగతా ఐదుగురు నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి బెయిల్ కోసం మహారాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. వీరి బెయిల్ పిటిషన్ సెప్టెంబర్ 23న విచారణకు రానుంది.

Rhea Chakraborty to be in Jail till Oct 6

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News