Home తాజా వార్తలు సుశాంత్ సింగ్ మృతిపై సిబిఐ దర్యాప్తు వేయాలి

సుశాంత్ సింగ్ మృతిపై సిబిఐ దర్యాప్తు వేయాలి

Rhea requests CBI investigation into Sushant death

 

న్యూఢిల్లీ: బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలని నటి రియా చక్రబర్తి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. సుశాంత్ సింగ్ మరణానికి దారితీసిన పరిస్థితులను తాను తెలుసుకోగోరుతున్నానని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసిన ఒక పోస్టులో సుశాంత్‌కు సన్నిహిత మిత్రురాలైన రియా కేంద్ర హోంమంత్రిని కోరారు. తాను సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ స్నేహితురాలినని, సుశాంత్ మరణించి ఇప్పటికే నెల రోజులు గడిచాయని, తనకు ప్రభుత్వంపై సంపూర్ణ విశ్వాసం ఉన్నప్పటికీ న్యాయం కోసం సుశాంత్ ఆకస్మిక మరణంపై సిబిఐతో దర్యాప్తు జరిపించాలని చేతులు జోడించి వేడుకుంటున్నానని అమిత్ షాను ఆమె కోరారు. ఏ ఒత్తిడిల వల్ల సుశాంత్ ఈ చర్యకు పాల్పడ్డాడో తాను తెలుసుకోదలిచానని ఆమె పేర్కొన్నారు. సుశాంత్ మరణానికి తానే కారణమంటూ తనకు ఆన్‌లైన్‌లో బెదిరింపులు వస్తున్నాయని ఆమె మరో పోస్టులో తెలిపారు.

https://www.instagram.com/rhea_chakraborty/?utm_source=ig_embed

 

Rhea requests CBI investigation into Sushant death