Home జాతీయ వార్తలు కొమ్ము కోసం ఖ‌డ్గ‌మృగాన్ని కాల్చి చంపిన వేటగాళ్లు

కొమ్ము కోసం ఖ‌డ్గ‌మృగాన్ని కాల్చి చంపిన వేటగాళ్లు

Rhino Shot Dead By Hunters In Assamగువాహ‌టి: కొమ్ము కోసం వేటగాళ్లు ఖ‌డ్గ‌మృగాన్ని కాల్చి చంపిన ఘటనలో అసోంలోని గాబ్రాయ్ యాంటీ పోచింగ్ క్యాంపస్  పరిధిలో శనివారం జరిగింది. ఘటనాస్థలిని అటవీశాఖ అధికారులు పరిశీలించారు. ఖ‌డ్గ‌మృగం కళేబారానికి అటవీశాఖ అధికారులు పంచనామా చేశారు. ఖడ్గమృగం శరీరంపై బుల్లెట్ గాయాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఖ‌డ్గ‌మృగాన్ని హతమార్చిన అనంతరం వేటగాళ్లు దాని కొమ్మును నరికి తీసుకెళ్లారని వారు వెల్లడించారు. ఈ ఘటనలో ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నామని వారు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అటవీశాఖ అధికారులు వెల్లడించారు.