Home తాజా వార్తలు వరి నాటు వేసిన ఎమ్మెల్యే, కలెక్టర్లు

వరి నాటు వేసిన ఎమ్మెల్యే, కలెక్టర్లు

 Farmers

 

మంచిర్యాల :తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో అన్నదాతల్లో ఆశలు చిగురించాయి.  రైతన్నలు ముసురును సైతం లెక్క చేయకుండా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని దేవునిగూడ పంచాయతీలోని చెర్లపల్లే గ్రామం మీదుగా వెళ్తున్న ఎమ్మెల్యే రేఖానాయక్ నాటేస్తున్న పొలం వద్ద ఆగారు. మహిళా కూలీలను పలకరించిన ఎమ్మెల్యే వారితో కలిసి పొలంలోకి దిగి కాసేపు నాటేశారు. ములుగు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గోవిందరావుపేట మండలంలో ఓ వ్యవసాయ పొలంలోకి దిగి కూలీలతో కలిసి నాటు వేశారు. అదేవిధంగా మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం గంగిపెళ్లి గ్రామంలో వ్యవసాయ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ భారతీ హోలికేరి వరి పొలాలను పరిశీలించారు. ఓ పొలంలో వరినాటు కొనసాగుతుండగా వెళ్లి కూలీలతో కలిసి కలెక్టర్ వరి నాటులో పాల్గొన్నారు.

 

Rice planted officers with Farmers