Home తాజా వార్తలు రైతులకు వరి నాటు వేసే యంత్రం ఎంతో ఉపయోగకరం…

రైతులకు వరి నాటు వేసే యంత్రం ఎంతో ఉపయోగకరం…

Rice Planting Machine

 

నిర్మల్ : మండలంలోని బాపట్ల గ్రామంలో శుక్రవారం రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి వరి నాటు వేసే యంత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… వరినాటు వేసే యంత్రం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రైతులు వరి నాటు వేసే యంత్రం ద్వారా నాటు వేస్తే తక్కువ సమయంలో అధిక పొలాన్ని నాటు వేయవచ్చన్నారు. కూలీలు సైతం తక్కువగా ఉపయోగపడతారని, పని ముట్లను ఉపయోగిస్తే ఖర్చు ఆదా అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎల్‌చల్ గంగారెడ్డి, జెడ్పిటిసి మార జీవన్‌రెడ్డి, సారంగాపూర్ జెడ్పిటిసి రాజేశ్వర్‌రెడ్డి, నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, భూషణ్‌రెడ్డి, మండల కన్వీనర్ మోహినొద్దిన్, ముత్యం, రైతులు పాల్గొన్నారు.

 

Rice Planting Machine is very useful to Farmers