Home Default ఐపిఎస్ అధికారినంటూ ఫేస్‌బుక్‌లో రిక్షావాలా మోసం

ఐపిఎస్ అధికారినంటూ ఫేస్‌బుక్‌లో రిక్షావాలా మోసం

 

 

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీ ప్రాంతంలో ఓ రిక్షావాలా ఐపిఎస్ అధికారి అని చెప్పుకొని పలువురి మహిళలను మోసం చేసిన కేసులో అతడిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జావేద్ ఉల్హా అనే వ్యక్తి (52) రిక్షా నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. అతడు పదో తరగతి కూడా సరిగా చదవలేదు. కానీ జావేద్ మాత్రం ఫేస్‌బుక్‌లో ఒక ఐపిఎస్ ఆఫీసర్‌ అంటూ ఎకౌంట్ ఓపెన్ చేశాడు. తన ఫేస్ బుక్ ఖాతా నుంచి దేశం మొత్తంలో 5000 మందిని స్నేహితులుగా చేసుకున్నాడు. అందులో మూడు వేల మంది మహిళలు ఉన్నారు. గత ఆరు నెలల నుంచి ఒక మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. అంతేకాకుండా తన ఫేస్ బుక్ ఖాతా నుంచి అసభ్యకరమైన సందేశాలు సదరు మహిళకు పంపేవాడు. దీంతో విసుగుచెందిన ఆమె బరేలీ ప్రాంతంలోని ఇజ్జత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఐపి అడ్రస్ ద్వారా జావేద్ ను పట్టుకొని కస్టడీలోకి తీసుకున్నారు. జావేద్ సోషల్ మీడియాకు బానిస కావడంతో పలువురు మహిళలతో అసభ్యకర చిత్రాలు పంపడమే కాకుండా సందేశాలను స్వీకరించేవాడని పోలీసులు గుర్తించారు. పలువురు మహిళలతో చాటింగ్ చేస్తున్నప్పుడు అతడి భార్య వద్ద హెచ్చిరించిన వినేవాడు కాదని పోలీసులు పేర్కొన్నారు. జావేద్‌పై ఐపిసి సెక్షన్ 465, 149, ఐటి యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. జావేద్ స్వస్థలం ఢిల్లీలోని దర్యాగంజ్ ప్రాంతం. ఒక రిక్షావాడు చేతిలో అంత మంది మహిళలు ఎలా మోసం పోయారని పోలీస్ అధికారి ఎకె వర్మ అశ్చర్యం వ్యక్తం చేశారు.

 

Rickshaw Puller Fraud Women with FB as IPS Officer