Home వార్తలు రియో ఒలింపిక్ గోల్ఫ్ కోర్స్…

రియో ఒలింపిక్ గోల్ఫ్ కోర్స్…

Untitled-5858రియో డి జనీరో: పరిసరాలకు సంబం ధించిన న్యాయ వివాదాలు, భూ యాజ మాన్యపు వివాదాలు, నిర్మాణం విషయంలో సందేహాల కారణంగా రియో డి జనీరో గోల్ఫ్ కోర్స్ నిర్మాణం ఆలస్యం అ యింది. అయితే దానిని ఆదివారం నిర్వాహకులకు అప్పగిం చారు. వచ్చే ఏడాది ఒలింపిక్స్‌లో గోల్ఫ్ కోర్సుకు ఆటంకం దీంతో తొలగి పోయింది. అనేక ఒలింపిక్ వేదికలున్న చోట, బాగా సంపన్నులున్న బార డా టిజుకకు పొరుగున ఉన్న ప్రదేశంలో నిర్మించిన గోల్ప్ కోర్స్‌ను సమర్థిస్తూ మేయర్ పేస్ 15 నిమిషాలు కోర్సులో గడిపారు. తనకు దన్నుగా నిలిచిన, గోల్ఫ్ కోర్సును నిర్మించిన బిలియనీర్ డెవ లపర్ పాస్క్వలె మారోకు ఆయన పదేపదే కృతజ్ఞతలు తెలిపారు. ఈ గోల్ఫ్ కోర్పు 20 ఏళ్లపాటు ప్రజలదై ఉంటుంది. తరువాత రియో లోని రెండు ప్రైవేట్ క్లబ్బులకు ఇచ్చేస్తారు. దీనిని నిర్మించేందుకు 3 సంవత్సరాలు పట్టింది. 112 ఏళ్ల తరువాత మళ్లీ ఒలింపిక్స్‌కు ఈ గోల్ఫ్ కోర్సు తిరిగొచ్చింది