Saturday, April 20, 2024

గల్లీ క్రికెట్ మ్యాచ్‌లో గొడవ

- Advertisement -
- Advertisement -

 

ఇద్దరికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు.. ఒకరి పరిస్థితి విషమం
లాక్ డౌన్ లెక్కచేయని యువత

మన తెలంగాణ/ కాజీపేట : క్రికెట్ మ్యాచ్ ఆడుకునే క్రమంలో ఇరువర్గాల మద్య జరిగిన తగాద తీవ్ర ఘర్షణకు దారితీసి దాడులు చేసుకోవడంతో ఇద్దరు అసుపత్రి పాలైన ఘటన శుక్రవారం కాజీపేటలో చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాజీపేట పట్టణం విద్యానగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలోని మైదానంలో ఒకే ప్రాంతానికి చెందిన యువకులు లాక్‌డౌన్ అయిన నేపద్యంలో గత కొంత కాలంగా రెండు టీంలుగా ఏర్పడి క్రికెట్ అడుకుంటున్నారు.

ఎప్పటిలాగే గురువారం సాయంత్రం యువకులు రెండు టీంలుగా ఏర్పడి అడుకుంటుండగా బ్యాట్స్‌మెన్ రన్‌అవుట్ విషయంలో వచ్చిన చిన్న గొడవ ముదిరి ఇరువర్గాలుగా విడిపోయి పరస్పరం బ్యాట్ వికెట్లు, కర్రలతో దాడి చేసుకున్నారని చెప్పారు. ఈదాడిలో ఒక వర్గానికి నల్లా హనుగోపాల్, సాతూరి గణేశ్‌ను మరో వర్గానికి చెందిన యువకులు కర్రతో ఇష్టం వచ్చినట్లు కొట్టి గాయపరిచినట్లు తెలిపారు. దింతో స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం అందివ్వడంతో తీవ్రగాయాలపాలైన హనుగోపాల్,గణేశ్‌లను అసుపత్రికి తరలించారు.

కాజీపేట సీఐ నరేందర్ తెలిపిన వివరాలు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల సమీపంలోని మైదానంలో క్రికెట్ ఆడుకుంటుండగా వచ్చిన గోడవలో కడారి యశ్వంత్, అరుణ్ కుమార్‌లు మా పెద్దనాన్న కొడుకు (సోదరుడు) నల్లా హనుగోపాల్, గణేశ్‌లను విచక్షణ రహితంగా కొట్టాడని, ప్రస్తుతం వారు అసుపత్రిలో చికిత్స పొందుతున్నారని దాడి చేసిన వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని పట్టణంకు చెందిన శనిగరపు శ్రావాణ్ కుమార్ పిర్యాదు చేశాడని తెలిపారు. భాదితుడి సోదరుడి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సిఐ తెలిపారు. ప్రస్తుతం గణేశ్ పరిస్థితి నిలరడగా ఉందని , హనుగోపాల్ ఎంజిఎంలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నట్లు సిఐ తులిపారు. నిందితులు పరారీలో ఉన్నారని వారి కోసం పోలీసులు గాలీస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News