Friday, April 19, 2024

హౌరాలో మళ్లీ అల్లర్లు: రెచ్చిపోయిన మూకలు

- Advertisement -
- Advertisement -

కోల్‌కత: పశ్చిమ బెంగాల్‌లోని హౌరాకు చెందిన శిబ్‌పూర్ ప్రాంతంలో శుక్రవారం వరుసగా రెండవరోజు కూడా హింసాకాండ చెలరేగింది. గురువారం సాయంత్రం శ్రీరామ నవమి ఊరేగింపుపై మూకలు దాడి చేయడంతో ఘర్షణలు చెలరేగగా శుక్రవారం కూడా ఈ ఘర్షణలు కొనసాగాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పెద్ద ఎత్తున పోలీసు బలగాలను ఆ ప్రాంతంలో మోహరించారు. రోడ్డుపక్కన ఉన్న టీస్టాల్స్‌ను, దుకాణాలను నిరసనకారులు ధ్వంసం చేయడంతోపాటు రాళ్లు రువ్వారు. స్థానికులు అపార్ట్‌మెంట్ల గేట్లకు తాళాలు వేసి ఇళ్లలో సురక్షితంగా ఉండిపోయారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక ప్రాంతీయ న్యూస్ చానల్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ&బిజెపికి చెందిన మూకలే ఈ దాడులకు బాధ్యులని ఆరోపించారు. హౌరా సంఘటన దురదృష్టకరమని, అల్లర్లు సృష్టించాలని ముందుగానే పథకం వేసుకుని చేశారని ఆమె అన్నారు. ఈ ఘాతుకానికి పాల్పడిన క్రిమినల్స్ పిస్టల్స్‌ను, పెట్రోల్ బాంబులను వెంట తెచ్చుకున్నారని ఆమె చెప్పారు. ఒక మతానికి చెందిన వారు అధికంగా నివసించే ప్రాంతంలో చచొరబడిన దుండగులు దుకాణాలను ధ్వంసం చేసి అల్లర్లకు పాల్పడ్డారని ఆమె చెప్పారు.

అల్లర్లకు పాల్పడిన వారిలో ఇప్పటివరకు 31 మంది అరెస్టు చేశారని, మిగిలినవారిని కూడా అరెస్టు చేస్తామని మమత చెప్పారు. నేరస్థులను కఠినంగా శిక్షిస్తామని, నష్టపోయిన వారికి పరిహరాం అందచేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇది హిందువులు చేసిన పని కాదని, బిజెపితో సంబంధాలు ఉన్న కొందరు దుందగులు ఈ దాడులకు పాల్పడ్డారని ఆమె చెప్పాను. గురువారం నాటి అల్లర్ల వెనుక ముస్లింలు లేరని, హింస వెనుక ముందస్తు కుట్ర ఉందని ఆమె అన్నారు.

కాగా.. శాంతి భద్రతల పరిస్థితి ప్రమాదకరంగా ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత్ మజుందార్ అభివర్ణించారు. శ్రీరామనవమి ఊరేగింపు ప్రశాంతంగా వెళుతుంటే పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారని, ఇళ్ల మిద్దెల పైనుంచి రాళ్లు పడ్డాయని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News