Friday, March 29, 2024

భారతీయులకు రిషి సునాక్ గుడ్‌ న్యూస్..

- Advertisement -
- Advertisement -

జకర్తా: బ్రిటన్ వెళ్లాలనుకునే భారతీయులకు బ్రిటన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. భారత యువ నిపుణులకు ఏటా 3000 వీసాలు అందించేలా సరికొత్త వీసా పథకానికి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఆమోదం తెలిపారు. జి20 సదస్సు వేదికగా భారత ప్రధాని నరేంద్రమోడీతో రిషి సునాక్ భేటీ అయిన కొద్ది గంటలకే యూకె ప్రభుత్వం నుంచి ఈ ప్రకటన వెలువడడం ప్రాధాన్యత సంతరించుకుంది. “యూకే ఇండియా యువ నిపుణుల వీసా పథకాన్ని ప్రకటిస్తున్నాం. ఈ పథకం కింద భారత్‌కు చెందిన 1830 ఏళ్ల డిగ్రీ విద్యావంతులకు ఏటా 3000 వీసాలు అందజేస్తాం. వారు బ్రిటన్‌కు వచ్చి రెండేళ్ల వరకు చదువుకోవడం, ఉద్యోగం చేసుకునేందుకు వీలుంటుంది.” అని బ్రిటన్ ప్రధాని కార్యాలయం బుధవారం ట్విటర్‌లో వెల్లడించింది.

ఇరు దేశాల మధ్య వలస భాగస్వామ్యం బలోపేతం చేసే దిశగా ఈ పథకాన్ని ఆమోదించామని, దీనికింద ప్రయోజనం పొందిన తొలిదేశం భారత్ అని యూకె ప్రభుత్వం తెలిపింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను, రెండు ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయడానికి, ఇండోపసిఫిక్ ప్రాంతంలో బలమైన బంధాలను ఏర్పర్చుకోవడానికి ఈ పథకం దోహదపడుతుందని డౌనింగ్ స్ట్రీట్ ఓ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు భారత్‌యూకె మధ్య స్వేచ్ఛా వాణిజ్యంపై ఈ ఏడాది ఆరంభంలో ప్రారంభమైన చర్చలు తుది దశకు చేరుకున్నాయి. ఇది కుదిరితే రెండు దేశాలు గరిష్ఠ వస్తువులపై కస్టమ్స్ సుంకాలను భారీగా తగ్గించడం, లేదా తొలగించడం చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు పెట్టుబడులను ప్రోత్సహించేలా నిబంధనలను సులభతరం చేయాల్సి ఉంటుంది.

Rishi Sunak good news for Young Indian Scientists

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News