Wednesday, April 24, 2024

సునాక్‌కు టీ కప్పులో తుపాన్

- Advertisement -
- Advertisement -

Rishi Sunak Wife Akshata Murty Serves Tea

భార్య అక్షత విలాసంతో ఇరకాటం

లండన్ : బ్రిటన్‌లో ప్రధాని పదవి పోటీలో ఉన్న రుషి సునాక్‌కు భార్య, బిలియనీర్ అక్షత మూర్తితో చిక్కులు ఏర్పడ్డాయి. అక్షత ఇప్పుడు టీ కప్పులో తుపాన్ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దీని ప్రకంపనలు రాజకీయంగా సునాక్‌కు తగిలాయి. తమ నివాసం వద్ద ఉన్న జర్నలిస్టులకు ఆమె టీ బిస్కట్లను అందిస్తూ ఉండగా అసలు వివాదానికి దారితీసింది. జర్నలిస్టులకు ఆమె అత్యంత ఖరీదైన ఒక్కొక్కటి 38 పౌండ్లు విలువ పలికే ఎమ్మా లెసి టీకప్పులలో టీ అందించారు. టీ కప్పులకే ఇంతటి ఖర్చా? ఎందుకింత విలాసం? దిగిపోయిన ప్రధాని జాన్సన్ తరహాలోనే ఈ కుటుంబం డబ్బులు వెదజల్లుతుందా? అని నెట్‌లో పెట్టిన ఫోటోలపై తీవ్రస్థాయి దుమారం రగులుకుంది. రుషి సునాక్ ప్రతి టీ కప్పునకు ఇంత డబ్డు పెడితే అక్షత ఈ పద్థతి చూస్తూ ఉంటే ఆమె కూడా జాన్సన్ భార్యను అనుకరిస్తూ ఉన్నట్లుందని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. ఈ టీకప్పులకు అయ్యే ఖర్చుతో ఓ కుటుంబానికి రెండు రోజుల పాటు తిండి పెట్టొచ్చు అని మరొకరు స్పందించారు.

ఈ విధమైనతంతుతో సునాక్ కూడా నిజాల పట్ల పెడచెవిని పెడుతున్నట్లు ఉందని మరో వ్యక్తి విమర్శించారు. చాలా రోజుల క్రితమే భారత పౌరసత్వం మహిళ , ప్రముఖ పారిశ్రామికవేత్త నారాయణ మూర్తి కూతురు అయిన అక్షత పన్నుల ఎగవేత వార్తలలో చేరి, భర్త సునాక్ రాజకీయ జీవితానికి షాక్ ఇచ్చారు. ఇప్పుడు ఈ మగ్‌ల వివాదానికి తెరతీశారు. పన్నుల మోతలు, జీవన వ్యయం పెరగడం, అవకతవకల విధానాలు, నేతల లగ్జరీ జీవిత విధానాలు ఇవన్నీ కలిపి జాన్సన్ ప్రభుత్వం పట్ల జనంలో నిరసనలు తలెత్తాయి. ఇది చివరికి పరోక్షంగా ఆయన నిష్క్రమణకు దారితీసింది. ప్రతిపక్షాలు చాలా కాలంగా అక్షత్ మూర్తి దేశీయేతర పన్నుల స్థాయిపై విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికీ భారతీయ పౌరురాలిగానే ఉన్న అక్షత నికర ఆస్తుల విలువ 1.2 బిలియన్ డాలర్లు వరకూ ఉంది. ఆమెకు తండ్రి నెలకొల్పిన ఇన్ఫోసిస్‌లో షేర్ల విలువ ఇది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News