Friday, March 29, 2024

నూతన డ్రైవింగ్ లెసెన్స్ విధానంతో నష్టాలే ఎక్కువ!

- Advertisement -
- Advertisement -
Risks are greater with new driving license policy
పాత పద్ధతిలోని లైసెన్స్ జారీ చేయాలంటున్న యూనియన్ నాయకులు

హైదరాబాద్: నూతన డ్రైవింగ్ లైసెన్స్ చట్టంతో ఇటు రవాణాశాఖ తన ఆదాయాన్ని కోల్పోవడమే కాకుండా వాహనదారులను మరింత దోచుకునే అవకాశం ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే వా హన రిజిస్ట్రేషన్లకు ప్రై వేట్ షోరూంలకు అప్పగించ డం వాటిపై అధికారుల పర్యవేక్షణలేక పోవడం తోవారు ఇష్టం వచ్చినట్లుగా వసూలు చేస్తున్నారని పలువురు వాహనదారులు ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులు, లేదా సంస్థలకు స్వప్రయోజనమే కానీ, ప్రజాప్రయోజనం పట్టదని అటువంటిది ఎటువంటిటెస్టులు లే కుండా డ్రైవింగ్ లెసెన్స్‌ఇచ్చే అధికారాన్ని డ్రైవింగ్ స్కూ ళ్ళు(టెస్టింగ్ సెంటర్‌లు)కట్టబెడి తేడబ్బులు తీసుకుని ఇ ష్టం వచ్చినట్లుగా లైసెన్స్‌లు ఇస్తారనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండారోడ్దుప్రమాదాలు కూడా అధికం అయ్యే అవకాశం ఉందనే సందేహంవ్య క్తం చేస్తున్నారు.

రవాణాశాఖ అధికారులు డ్రైవింగ్‌కు సంబంధించి అన్ని రకాలు పరీక్షలు నిర్వహిస్తేనేరోడ్డు ప్రమాదాలకుజరుగుతున్నాయని అలాంటిది ఎటువంటి టెస్టులు లేకుండా డ్రైవింగ్ లెసెన్స్ ఇస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నా రు. నగరంలోని అనేకడ్రౌవింగ్ స్కూళ్ళు ఒక దానికిరవాణాశాఖ నుంచి అనుమతి తీసుకుని దానికి అనుబంధంగా అనేక స్కూళ్ళను నడిపిస్తున్నారని,ఇదే పద్దతిని ప్రభుత్వం చేత గుర్తింపడిన డ్రైవింగ్ సెంటర్ నిర్వాహకలు అమలు చేయరని గ్యారంటీ ఏమీ లేదంటున్నారు. రోడ్దు ప్రమాదాలకు కారణంగా డ్రైవింగ్‌లో సరైన శిక్షణ లేక పోవడమే అని అనే సంఘటనలు రుజువు చేస్తున్నా ప్రైవేట్ సంస్థలకు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేవిధంగా కేంద్ర ప్రభుత్వం చట్టం చేయడం అర్దం లేదని పని అంటున్నారు.

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వాహన రిజిస్ట్రేషన్లకు సంబంధించిన బాధ్యతనుప్రైవేట్ సంస్థలకు అప్పగించిన సంగతి తెలిసిందే. వాహన దారులకు డ్రైవింగ్ లైసెన్స్‌కూడా ఇచ్చే బాధ్యతను ప్రవేట్ సంస్థలకు అప్పగిస్తే రవాణాశాఖ అధికారులు ఏమి చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. రోజు రోజు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు కారణం అనుభవం లేని డ్రైవింగ్ విధానమని అనేక సందర్భాల్లో అధికారులు చెప్పారనిఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. మరింత మెరుగైన డ్రైవింగ్ శిక్షణకు కఠిన నిబంధనలు అమలుచేయాల్సి ఉండగా వాటిని పూర్తిగా పక్కకు పెట్టడంలో అర్దం లేదంటున్నారు.

మరింత దోపిడీకి అవకాశం : ఇప్పటికే అనేక నగరంలోని అనేక డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకులు 15 రోజుల్లో డ్రైవింగ్ నేర్పుతాం.. 24 గంటల్లో డ్రైవింగ్ నేర్పుతామంటూ వాహనదారులను ఆకర్షిస్తూ వారి వద్ద నుంచి రూ. 5 నుంచి 10 వేలు వసూలు చేస్తున్నారు. ఇక అధికారికంగా డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ ని ర్వహించిదాని ద్వా రానే లైసెన్స్ పొందే అవకాశా న్ని వారి చేతుల్లో పెడి తే నిర్వాహకుల దోపిడికి అడ్డు అదుపు ఉండదని యూనియన్ నాయకులు ఆర్లసత్తిరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.గతంలో మాదిరిగారవాణాశాఖ పరిధిలోని డ్రైవింగ్ ట్రాక్‌ల మీద డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించిన అనంతరం సంబంధితలైసెన్స్‌లు జారీ చే యాలని ఆయన డిమాండ్ చేస్తున్నా రు. ఈ అంశం పై త్వరలో తాము రవాణాశాఖ అధికారులకు వినతి పత్రంసమర్పిస్తామంటున్నారు. వాహనదారుల భద్ర తను గాల్లోకి వదిలేసే ఇటువంటి చట్టాలను తాము పూర్తి వ్యతిరేకమని బిఎంఎస్‌నాయకులు రవిశంకర్ దీనిపై పెద్ద ఎత్తున ఆందోళను నిర్వహించేందుకు వెనుకాడమని హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News