Home జాతీయ వార్తలు శివుని వేషధారణలో తేజ్ ప్రతాప్ పూజలు

శివుని వేషధారణలో తేజ్ ప్రతాప్ పూజలు

Tej Pratapపాట్నా:బిహార్ మాజీ సీఎం, ఆర్ జెడి అధినేత లాలూప్రసాద్ యాదవ్ కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ శ్రావణమాసంలోని తొలి సోమవారం (జులై22న)  శివుడి వేషధారణతో ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గతేడాది శ్రావణ మాసంలో తేజ్ ప్రతాప్ యాద్ డియోగఢ్ లోని బాబా బైద్యనాథ్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన విషయం తెలిసిందే. పాట్నాలోని శివాలయంలో కూడా ఆయన పూజలు చేశారు. బిహార్ ప్రజలు ప్రతి ఏడాది శ్రావణ మాసంలో బాబా బోలేనాథ్ (శివుడు) నామస్మరణ చేస్తారన్న విషయం విదితమే. రాజస్థాన్, పంజాబ్, యుపి, మధ్యప్రదేశ్, బిహార్ తదితర రాష్ట్రాల్లో శ్రావణమాసం ఈ ఏడాది జులై 17న ప్రారంభమైంది. శ్రావణ మాసం ఆగస్టు 15న ముగుస్తుంది.

RJD Leader Tej Pratap Worship In Lord Shiva Temple