Home ఆంధ్రప్రదేశ్ వార్తలు రోడ్డు ప్రమాదంలో పది మందికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో పది మందికి గాయాలు

Road Accident At Prakasam In APప్రకాశం : ప్రకాశం జిల్లా  అద్దంకి మండల పరిధిలోని వెంకటాపురం వద్ద హైవేపై మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 10 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు. బస్సు హైదరాబాద్‌ నుంచి కందుకూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.