Home తాజా వార్తలు చిలుకూరు లో ఘోర రోడ్డు ప్రమాదం…

చిలుకూరు లో ఘోర రోడ్డు ప్రమాదం…

Accident

 

చిలుకూరు : సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం మిట్స్ కళాశాల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మృతులు మహబూబాబాద్ జిల్లా, కొరివి మండలం, చింతపల్లి గ్రామంకు చెందిన వారు. ఆటో టి ఎస్ 29.1995, లారీ టి ఎస్ ఎ పి 16 టి ఈ 5049, ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మృతి చెందిన సంఘటన శుక్రవారం కోదాడ -హుజూర్ నగర్ రోడ్డు పై జరిగింది. పోలీసులు మృతుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం హుజూర్ నగర్ నుండి ఆటోలో కోదాడకు వస్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో మహబూబాద్ జిల్లా కొరివి మండలం, చింతపల్లి గ్రామంకు, చెందిన ఒకే కుటుంబ సభ్యులు షేక్ అప్జల్‌పాష, (48), గౌసియాబేగం (40), మహిమూదబేగం, (35) మహిన్ (15), ముష్కన్ (12) మృతి చెందినారు.

వీరిలో నలుగురు తలకు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా ముష్కన్, చికిత్స నియమితం ఖమ్మం తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో మృతి చెందింది. ఆటో ఉన్న షేక్ మహబూబ్ పాషకు, తీవ్ర గాయాలై పరిస్థితి విషమంగా ఉంది. ఖమ్మం వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. అలాగే ఆటోలో ఉన్న జాకీర్ పాషకు, ఆటో డ్రైవర్ నాగులుమీరకు తీవ్ర గాయాలైనాయి. వీరిని మెరుగైన వైద్యం నియమితం ఖమ్మం వైద్యశాలకు తరలించారు.

మృతులంతా ఒకే కుటుంబ సభ్యులు : కాగ మృతి చెందిన వారంతా ఒకే కుటుంబంకు చెందిన వారు షేక్ అబ్దుల్ పాష , వీరంతా తన చెల్లెలు అక్తర్‌బేగం, మనవరాలు, బారసాల ఫంక్షన్‌కు బుధవారం కోదాడకు వచ్చారు . అతనితో పాటు ఆయన భార్య గౌసియాబేగం, తమ్ముడు, షేక్ మహబూబ్‌పాష, తమ్ముడు భార్య మహిబూబ్ బేగం, తమ్ముడు కుమార్తెలు, మహిం , ముష్కన్, ఆయన కొడుకు జాకీర్ పాషాలు, వచ్చారు. బుధవారం ఫంక్షన్‌ పూర్తి కాగనే అప్జల్‌పాష, చిన్న తమ్ముడు యాకూబుపాష ఇంటికి హుజూర్‌నగర్ వచ్చారు.

ఆరోజు రాత్రి అక్కడే ఉండి గురువారం ఉదయం జాన్‌పాడు దర్గకు వెళ్ళి అదేరోజు 7 గంటలకు హుజూర్ నగర్ చేరుకున్నారు. అయితే రాత్రి సమయంలో వెళ్ళడం వద్దు అనుకోని రాత్రి అక్కడే నిద్రపోయి తెల్లవారు జామున 6 గంటలకు లేచి తమ స్వగ్రామంకు బయలు దేరినారు. ఈ క్రమంలో హుజూర్‌నగర్ నుండి కోదాడకు వచ్చేందుకు లోకల్ ఆటో కిరాయికి మాట్లాడుకోని ఎక్కి కోదాడుకు వస్తుండగా ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నది.

ఈ ప్రమాదంలో అందరూ ఒకే కుటుంబంకు చెందినవారు ఉన్నారు. ఈ యొక్క సంఘటన స్థలంను జిల్లా ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు, డిఎస్పీ సుదర్శన్‌రెడ్డి, సిఐలు, రవి, శ్రీనివాస్‌రెడ్డిలు, పరిశీలించారు. మృతుల బంధువులు యాకూబ్ పాష, ఇచ్చిన పిర్యాదు మేరకు, కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్టుగా ఎస్‌ఐ వెంకన్న, తెలిపారు.

 

Road Accident in Chilkur