Home తాజా వార్తలు జడ్చర్ల, కోదాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

జడ్చర్ల, కోదాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

Road accident

 

కల్వకుర్తి : నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం మార్చాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాంలో ఇద్దరు మృతి చెందారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కురిమిద్ద గ్రామానికి చెందిన కాలే నాగరాజు (28) తన ద్విచక్ర వాహనం పై గ్రామానికి చెందిన పార్వతమ్మ అనే మరో మహిళను ఎక్కించుకుని కల్వకుర్తికి వస్తుండగా మార్చాల సమీపంలో గల ప్రధాన కూడలి దగ్గర జాతీయ రహదారిపై మల్లే క్రమంలో కల్వకుర్తి వైపు నుంచి అతివేగంగా వచ్చిన టిప్పర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి, టిప్పర్ డ్రైవర్ ఆపకుండా వెళ్ళిపోయాడు. ఈ ప్రమాదంలో నాగరాజు అక్కడిక్కడే మృతి చెందాడు.

వెనకాల కూర్చున్న మహిళ పార్వతమ్మ తీవ్రంగా గాయపడడంతో కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ్నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందింది. అతివేగంగా టిప్పర్ నడపడమే కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి కనీసం మానవత్వం లేకుండా ఆపకుండా వెళ్లిన వాహనం, ప్రమాదానికి కారణం అయిన వాహనం నెంబర్ జడ్చర్ల కోదాడ జాతీయ రహదారి నిర్మిస్తున్న అనూష ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందినదిగా గుర్తించిన పోలిసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Road accident on Jadcharla and Kodada National Highway