Home తాజా వార్తలు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

 Road Accident On National Highway

హైద‌రాబాద్‌: రోడ్డు  ప్రమాదం లో ఇద్దరు వ్య‌క్తులు మృతి చెందిన సంఘటనా రంగారెడ్డి జిల్లా షాద్‌న‌గ‌ర్‌ పట్టణంలో పాత జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్య‌క్తులు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. వివరాలలోకి వెళితే.. నందిగామ మండల పరిధిలోని ఓ పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న‌ విష్ణువర్ధన్, సుబ్బారావు అనే ఇద్దరు వ్యక్తులు తమ విధులు ముగించుకొని బైక్ పై షాద్ నగర్ వస్తుండగా ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. షాద్ నగర్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న మాక్స్ ట్రాక్ బోలోరా వాహనం డ్రైవర్ మద్యం మత్తులో ఓవర్ స్పీడ్‌తో వాహ‌నాన్ని నడపడంతో బోలోరా వాహనం బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న వారికి తీవ్రంగా గాయపడటంతో అక్కడిక్కడే మృతి చెందారని స్థానికులు చెప్పారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని పరిశీలించారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. మృతి చెందిన ఇద్దరు వ్యక్తు ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.

 Road Accident On National Highway

Telangana News