Home నల్లగొండ రహదారుల రక్తదాహం!

రహదారుల రక్తదాహం!

road-accidentsబెంబేలెత్తిస్తున్న వరుస ప్రమాదాలు
పెద్దవూర, చింతపల్లి, ఆత్మకూర్(ఎం)లలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి మృతి
ఆయా ప్రమాదాల్లో 25మందికి పైగా గాయాలు

మన తెలంగాణ / నల్లగొండ : జిల్లాలోని రహదారులు రక్తమోడుతున్నాయి. నిత్యం ఏదో ఒక రహదారిపై గత కొన్ని రోజులుగా వరుసగా ప్రమాదాలు జరుగుతున్న తీరు ప్రజలను, వాహన చోదకులను, ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. రామన్నపేట మండలం తుమ్మలగూడెం వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న సంఘటనలో 10మంది మృతి చెందడం… 16 మంది క్షతగాత్రులు అయిన సంఘటనను మరువక ముందే జిల్లాలోని వివిధ రహదారులపై గురు, శుక్రవారం రోజుల్లో జరిగిన వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా మరో 20కి పైగా మంది తీవ్రగాయాలకు గురై వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందు తున్నారు. ఇదిలా ఉండగా ఆదివారం జిల్లాలోని పెద్దవూర మండలం పోతునూరు స్టేజీ సమీపంలో కారు, బొలేరో వాహనాలు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఇదే రోజున సరిహద్దున ఉన్న మాడ్గుల మండలం అన్నబోయినపల్లి వద్ద నాగార్జున సాగర్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరు మృతి చెందారు.

హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు వెళ్తున్న ఆర్టీసీ బస్సును డీసీఎం ఢీ కొన్న సంఘటనలో మరో ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అలాగే ఆత్మకూర్ (ఎం) మండలంలో ఆటో బోల్తా పడిన సంఘటనలో ఒక మహిళ మృతి చెందింది. ఆయా ప్రమాదాల్లో క్షతగాత్రులైన వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వారు ప్రాణాలతో ఆసుపత్రుల్లో పోరాటం చేస్తున్నారు. 65నెంబర్ జాతీయ రహదారిపై గురువారం రాత్రి నార్కెట్‌పల్లిలోని కామినేని హాస్పిటల్ వద్ద ఉన్న వై జంక్షన్ వద్ద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రెండు ఆర్టీసీ బస్సులు ఢీ కొన్న విషయం విది తమే. మనుగురు డిపోకు చెందిన బస్సు హైదరాబాద్‌కు వెళ్తుండగా హైదరాబాద్ నుండి గుంటూరు జిల్లా నరసరావుపేటకు వెళ్తున్న ఇంద్రా బస్సు మనుగురు డిపో బస్సును వెనుకవైపు నుండి ఢీ కొంది. ఈ సంఘటనలో ఆయా బస్సులో ప్రయా ణిస్తున్న 10 మంది ప్రయాణికులకు గాయాలైన విష యం తెలి సిందే.

అదేరోజున ఇదే రహదారిపై నార్కెట్ పల్లి సమీ పంలో ఎదురుగా వస్తున్న ఆటోను కారు ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఆటోలో ప్రయా ణిస్తున్న ఆరుగురు పత్తి కూలీలకు తీవ్రగాయాలైనాయి. అలాగే గురువారం ఆర్థరాత్రి నాగార్జున సాగర్‌లోని హైదరా బాద్ మాచర్ల రహదారిపై కారును డిసిఎం ఢీకొట్టింది. ఈ సంఘట నలో ఆయా వాహనాల్లో ప్రయా ణిస్తున్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే ప్రమాదానికి గురైన డిసిఎం, కారు మంటల్లో దగ్ధమ వ్వడం విధితమే. శుక్రవారం రాజాపేట మండలంలో జరిగిన ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొన్న సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 10మంది పత్తి కూలీలు గాయాల పాలైనారు. గుర్రంపోడు మండలంలోని పాల్వాయి గ్రామం వద్ద దేవరకొండ – నల్లగొండ రహదారిపై ఆటోను తూపాన్ వాహనం ఢీకొన్న సంఘటనలో ఇద్దరు సంఘటన స్థలంలోనే మృతి చెందడం తెలిసిందే. ప్రమాదానికి గురైన వాహనాలు రెండు ఎదురెదురుగా ఢీకొనడం గమనార్హం. ఇదిలా ఉండగా జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు 1565కు పైగా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఆయా ప్రమాదాల్లో 573కు పైగా మంది ప్రాణాలు గాలిలో కలిసి పోయా యి.

మరో 2130మంది క్షతగాత్రులైనారు. క్షతగా త్రుల్లో కొందరు వికలాంగులుగా మారి జీవితాలను నెట్టుకొస్తున్నారు. ఇంటికి పెద్దగా ఉన్న ఇంటి యజమాని ప్రమాదంకు గురై నేడు జీవస్తవంగా కళ్ల ముందు కనిపిస్తున్న తీరును చూసి బాధిత కుటుంబాలు నిత్యం కంటతడి పెడుతూనే ఉన్నాయి. జిల్లాలో రహదారి ప్రమాద సంఘటనలు రోజురోజుకు అధిక మవుతూ కలవరాన్నిరేపుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో మృత్యుల సంఖ్య కూడా పెరుగు తున్నప్పటికి వాటికి అడ్డుకట్ట వేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాలు అంతత మాత్రం గానే కనిపిస్తు న్నాయి. ప్రమాదాలకు పదేపదే కారణ మవుతున్న రహదారులపై డివైడర్లను ఏర్పాటు చేసే విధంగా కూడా అధికారులు పట్టిపట్టనట్లు వ్యవహ రిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని 9వ నెంబర్ జాతీయ రహదారిని ఫోర్‌వేగా తీర్చిది ద్దినప్పటి నుండి ఈ రహదారిపై ప్రమాదాల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టినప్పటికి ఈ రహదారిపై రోజు ఎక్కడో ఒక దగ్గర ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

ఈ రహదారిని 65వ నెంబర్ జాతీయ రహదారిగా మార్చినప్పటి నుండి రహదారిపై వెళ్తున్న వాహనాలు మరింత వేగంగా వెళ్తుండడంతో పాదచా రులకు, చిన్న చిన్న ద్విచక్ర వాహనదారులకు ప్రమా దాలు తప్పడం లేదు. అతివేగం కారణంగా ఈ రహదా రిపై ఇటీవల కాలంలో వాహనాలు బోల్తాపడడం సర్వ సాధారణంగా మారింది. ఈ రహదారిపై వేగంగా వెళ్తున్న వాహనా లను నియంత్రించేందుకు జిల్లా పోలీస్ శాఖ ఇంటర్ సెప్టర్ అనే వాహనాన్ని ఏర్పాటు చేసినప్పటికి ఈ రహదారిపై వేగంగా వెళ్తున్న వాహనాల నియంత్రణ మేడిపండు చందంగానే కనిపిస్తుంది. జిల్లాలో జరుగు తున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఎప్పటికప్పుడు చెప్పుతూ వస్తున్న అధికారులు ప్రమా దాల నివారణకు అవసరమైన చర్యలను తీసుకోవడంలో విఫలమవుతున్నారని ఆరోపణలు ప్రజలనుంచి వినిపిస్తున్నాయి.