Tuesday, March 21, 2023

రోడ్ టెర్రర్..

- Advertisement -

road

* దూసుకొస్తున్న వాహనాలు
* మద్యం మత్తులో వాహనాల డ్రైవర్లు
* పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు
* గాలిలో కలుస్తున్న ప్రాణాలు
* ఫోర్‌లేన్ రోడ్డు వేస్తేనే తగ్గనున్న ప్రమాదాలు

ప్రతి నిత్యం రోడ్డు ప్రమాదాలు జరు గుతుండగా ఎంతో మంది ప్రాణాలు గాలిలో కలుస్తు న్నాయి. డ్రైవర్లు మద్యం మత్తులో వాహనాలను వేగంగా నడపడం వలన ప్రమా దాలు సంభవిస్తున్నాయి. నిలిపి ఉన్న వాహనాలను  ఢీకొట్టడం ,  మంచిర్యాల జిల్లా కేంద్రంలోకి భారీ వాహనాలు  రాకుండా నియంత్రించేందుకు లక్ష్మి థియేటర్ వద్ద  పోలీసు అవుట్ పోస్టు ఏర్పాటు చేసినప్పటికీ సరైన నిర్వహణ లేకపోవడంతో భారీ వాహనాలు  జిల్లా కేంద్రంలోకి దూసుకువచ్చి ప్రమాదాలు పెరుగుతున్నాయి.

మనతెలంగాణ/మంచిర్యాల ప్రతినిధి:  ప్రతి నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగు తుండగా ఎంతో మంది ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. డ్రైవర్లు మద్యం మత్తులో వాహనాలను వేగంగా నడపడం వలన ప్రమాదాలు సంబవిస్తున్నాయి. నిలిపి ఉన్న వాహనాలను  ఢీకొట్టడం , అంతే కాకుండా వేగంగా దూసుకువచ్చి ఢీకొనడం వలన ప్రమాదాలు పెరిగి పోతున్నాయి. జిల్లా కేంద్రంలోకి భారీ వాహ నాలు  రాకుండా నియంత్రించేందుకు లక్ష్మి థియేటర్ వద్ద  పోలీసు అవుట్ పోస్టు ఏర్పాటు చేసినప్పటికీ సరైన నిర్వహణ లేకపోవడంతో భారీ వా హనాలు  జిల్లా కేంద్రంలోకి దూసుకువచ్చి ప్రమాదాలు పెరుగుతున్నాయి. అడ పాదడప పోలీసులు డ్రంక్ అండ్‌డ్రైవ్ నిర్వహిస్తున్నప్పటికీ ద్విచక్రవాహనా లకు మాత్రమే జరిమానా విధిస్తుండగా భారీ వాహనాల డ్రైవర్లను పట్టించుకో వడం లేదు. దీని వలన భారీ వాహనాల డ్రైవర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వాహ నాలను నడ పడం వలన  ప్రతినిత్యం ఏదో ఒక చోట ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పొ తున్నారు. శ్రీరాంపూర్ నుండి మంచిర్యాల మీదుగా కొమురం భీం జిల్లా వాంకిడి వరకు గల రాష్ట్రీయ రహదారిపై  ప్రతినిత్యం ప్రమాదాలు జరు గుతున్నాయి. ఈ రహదారిని ఫోర్‌లేన్ రోడ్డు వేస్తేనే ప్రమాదాలు తగ్గు ముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. శనివారం మందమర్రి వద్ద జరిగిన ప్రమా దంలో ప్రశాంత్‌యాదవ్ మరణించగా కిరణ్ అనే వ్యక్తి  తీవ్రంగా గాయపడ్డారు. మందమర్రి సిగ్నల్ పాయింట్‌వద్ద ముందు లారీనిలిపిఉండగా ఇద్దరు వ్యక్తులు వాహనంపై కూర్చొని ఉన్నారు. అయితే వేగంగా వచ్చిన ఐచర్ వ్యాన్ ఢీకొన డంతో  ఒక్కరు అక్కడిక్కడే మృతి చెందగా మరొక్కరు తీవ్రంగా గాయపడ్డారు.  ఆదివారం చెన్నూర్ మండ లం కిష్టంపేట సమీపంలో జోడువాగువద్ద ఆగి ఉన్న కారును టిప్పర్ వేగంగా వచ్చి ఢీకొనడంతో ప్రమాదం జరగగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. నిలిపి  ఉన్న కారును ఢీకొనడంతో అందులో ఎవరు లేకపోగా ప్రమాదం తప్పింది. మద్యం మత్తులో టిప్పర్‌ను నడపడం వలన ఎస్‌ఐ ప్రవీణ్ సంఘటన స్థలానికి వెళ్లి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. గత మూడు నెలలుగా జరిగిన రోడ్డు ప్రమాదాలను పరిశీలించినట్లయితే  22మంది మృత్యు వాత పడగా 47 మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు.  ఈమార్గంలో ప్రమా దాలు సంబవించి మృత్యు వాత పడినప్పుడే అప్రమత్తమవుతున్న పోలీసులు మళ్లీ ట్రాఫిక్  సమస్యను,అంతే కాకుండా మద్యం మత్తులోవాహనాలను నడుపుతున్న డ్రైవర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అంతే కాకుండా మంచి ర్యాల పట్టణంలోకి భారీ వాహనాలు రాకుండా చూడాల్సిన పోలీసులు నిర ్లక్షంగా వ్యవహరిచడం వలన పట్టణంలో సైతం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా బైపాస్ రోడ్ నిర్మించి వాహనాలను పట్టణంలోకి రాకుండా మళ్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News