Tuesday, March 21, 2023

విద్యార్థుల శ్రమదానంతో రూపుదిద్దుకుంటున్న రహదారులు

- Advertisement -

coeanigమన తెలంగాణ/పెద్దశంకరంపేట : శ్రమదానం గ్రామ వీధుల రూపు రేఖలు మారుస్తోంది. మండల పరిధిలోని బుజ్రాన్‌పల్లి, టెంకటి గ్రామాల్లో స్థానిక ప్రభుత్వ జూనియ ర్ కళాశాల విద్యార్థులు జాతీయ సేవా పథ కం(ఎన్‌ఎస్‌ఎస్) పనులు చేపట్టారు. కళాశాలలో విద్యార్థుల సంఖ్యను అనుగుణంగా రెండు ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్లు ఏర్పాటు చేశా రు. యూనిట్1కి అధ్యాపకుడు శ్రీశ్రైలం, యూనిట్-2కి మరో అధ్యాపకుడు ప్రభాకర్ ఇన్‌చార్జిగా వ్యవహారిస్తున్నారు. ఈ రెండు యూనిట్‌ల సభ్యులు మండల పరిదిలోని రెండు గ్రా మాల్లో శీతాకాల శిబిరాలను ఏర్పాటు చేసుకున్నారు. మొదటి యూనిట్ టెంకటిలో, రెండవ యూనిట్ బు జ్రాన్‌పల్లిలో క్యాంపులు ఏర్పాటు చేసుకున్నారు. పురు ష విద్యార్థులకు ఆయా గ్రామాల సర్పంచ్‌లు అనితా విఠల్, రాములు తమ గ్రామంలోనే వసతి సౌకర్యం కల్పించారు. బాలికలు మాత్రం రోజు ఇంటి నుంచే తిరిగే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. గత మూడు రోజులుగా గ్రామంలోని వివిధ సంస్థల వద్ద చేపట్టిన కార్యక్రమాలు సత్పలితాలనిచ్చా యి. బుజ్రానపల్లి హారిజన్ వాడ పాఠశాల వద్ద ఆదివారం చేపట్టిన శ్రమదానంతో పాఠశాల ఆవరణలో పేరుకుపోయిన చెత్తకు మో క్షం కలిగింది. అలాగే టెంకటిలో శివాల యం వీది ప్రధాన రహాదారి ముందు చీపు ళ్లు చేతపట్టి విద్యార్థినులు శుభ్రం చేశారు. టెంకటి లోని వీధులు, గ్రామపంచాయతీ కూడలి కొత్త రూపు సంతరించుకున్నాయి. కేవలం పనులు చేశామా… వచ్చామా… అనే చందంగా కాకుండా చేసిన పని పక్కాగా చేయాలని కళాశాల ప్రిన్సిపాల్ అవనీష్ రెడ్డి నిర్ణయించడంతో మూడు రోజుల్లోనే వీధులన్నీ పరిశుభ్రంగా మారిపోయాయి. విద్యార్థులు పూర్తి స్థాయిలో నిమగ్నమై సేవా కార్యక్రమాల్లో మునిగిపోయారు. దీంతో ఎన్‌ఎస్‌ఎస్ పనులు సంపూర్ణంగా కొనసాగుతున్నాయి. శిబిరం ముగిసేలోగా రెండు గ్రామాలను స ర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలనే ప్రయత్నంలో కళాశాల అధ్యాపక బృందం ప్రయత్నిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles