Home ఆంధ్రప్రదేశ్ వార్తలు ఎపి మాజీ స్పీకర్ ఇంట్లో చోరీ…

ఎపి మాజీ స్పీకర్ ఇంట్లో చోరీ…

AP Speaker
గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్ కోడెల కోడెల శివప్రసాదరావు నివాసంలో చోరీ జరిగింది. ఈ రోజు ఉదయం సత్తెనపల్లిలోని కోడెల నివాసంలో కరెంటు పని చేయాలంటూ ఇద్దరు వ్యక్తులు వచ్చారు. అయితే, వాచ్‌మేన్‌కు అనుమానం రావడంతో వారిని అడ్డుకున్నాడు. దీంతో వారు వాచ్‌మేన్‌ను తోసేసి కంప్యూటర్లుతో పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
మరోవైపు కోడెల, అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపు వ్యవహారం‌పై ఏపి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీనిపై ఎపి అసెంబ్లీ అధికారులు ఆయనకు నోటీసులు కూడా ఇచ్చారు. ఇందులో భాగంగా ఇవాళ కోడెల నివాసంలో తనిఖీలు జరపనున్నట్లు సమాచారం.
Robbery in AP Former Speaker Kodela Home