Home అంతర్జాతీయ వార్తలు సామర్థ్యానికి రోబో షార్టుల ఊతం

సామర్థ్యానికి రోబో షార్టుల ఊతం

Robot shorts

 

వాషింగ్టన్ : వ్యక్తి దైనందిన జీవితంలో ఏ పనిచేసినా తన సామర్థ్యానికి ఊతం ఇచ్చే రోబో షార్టులను శాస్త్రవేత్తలు తయారు చేయగలిగారు. ఎక్సోసూట్స్ అని వీటిని పిలుస్తున్నారు. జత రోబోటిక్ షార్టులను ఇటీవలనే ప్రదర్శించారు. నడిచినా పరుగెత్తినా మరే పనిచేసినా ఈ షార్టులు ఊతం ఇస్తాయి. సామర్థ లోపం కనిపించనీయవు. వీటిని ధరించే వారి నడుం కు చుట్టుకున్న బ్యాటరీ, వెనుకభాగాన మోటా ర్ కేబుల్స్ అనుసంధానంతో ఇవి పనిచేస్తాయి. మొత్తం వీటి బరువంతా 5 కిలోల వరకు ఉంటుంది. ఎవరైతే వీటిని తొడుగుకుంటారో వారి నడక, పరుగు తదితర పనుల తీరు బట్టి ఇవి వారికి సహకరిస్తాయి.

ఇదివరకు ఇలాం టి సాధనాలు కొన్ని అమలులోకి వచ్చినా అవి ఏదో ఒక పనిచే పరిమితమై పని చేసేవి. కానీ ఈ షార్టులు అలా కాదు. అన్ని పనుల్లోను సామర్థాన్ని పెంచుతాయి. వెచ్చించ వలసిన శక్తిని తగ్గిస్తాయని హార్వర్డ్ లిస్ యూనివర్శిటీ బయోలాజికల్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన కోనా ర్ వాల్ష్ చెప్పారు. మూడు సెన్సార్లతో ఆల్గోరిథమ్స్‌ను అభివృద్ధి చేసి 99 శాతం కచ్చితత్వా న్ని సాధించినట్టు తెలిపారు. అంటే వీటి ఊతం తో ఏ పనైనా 99 శాతం కచ్చితంగా నెరవేర్చే సామర్థం ఏర్పడుతుంది. నడకలో 9.3శాతం, పరుగులో 4 శాతం వరకు శక్తిని తగ్గించి సామర్థాన్ని పెంపొందిస్తాయని పరిశోధకులు వివరించారు. హార్వర్డ్ యూనివర్శిటీ, నెమ్రిస్కా ఒమసా యూనివర్శిటీలకు చెందిన పరిశోధకులు ఈ షార్టుల రూపకల్పనలో పాలుపంచుకున్నారు. వీరి పరిశోధనల వివరాలు జర్నల్ సైన్సులో ప్రచురిత మయ్యాయి.

Robot shorts that give his ability to do any work