Home ఆదిలాబాద్ ఆర్‌వోఎఫ్‌ఆర్ భూములను సాగుకు యోగ్యంగా తీర్చిదిద్దాలి

ఆర్‌వోఎఫ్‌ఆర్ భూములను సాగుకు యోగ్యంగా తీర్చిదిద్దాలి

ROFR farming should be suitable for cultivation

కలెక్టర్ దివ్య దేవరాజన్

మన తెలంగాణ/ఆదిలాబాద్: ఆర్‌వోఎఫ్‌ఆర్ భూము లను సాగుకు యోగ్యంగా చేసేందుకు సంప్రదాయ పంటలతో పాటు పండే మొక్కలను పేంచేందుకు పైలట్ ప్రాజెక్టు కింద జిల్లాలో పనులు చేపట్టడం జరుగు తున్నదని జిల్లా కలెక్టర్ డి.దివ్య తెలిపారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, స్వచ్ఛంద సంస్థలతో సమావేశం జిరిగింది. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్‌వోఎఫ్ భూము ల్లో పూర్వవైభం తీసుకువచ్చేందుకు అటవీ యేతర మొక్కలు అనగా పండ్ల మొక్కలు పెంచడానికి ప్రతిపాదించడం, పైలట్ ప్రాజెక్టు కింద 210 ఎకరాలలో మొక్కలు నాటేందుకు, సంప్రదాయ పత్తి పంటతో పా టు, ఇతర ఆర్థిక పరిపుష్టి పెంచే పండ్ల మొక్కలు నాట డం జరుగుతుందని తెలిపారు. ఇందులో సుమారు 134 ఎకరాల్లో సీతాఫలం, 25 ఎకరాల్లో యాపిల్‌బేర్, 52 ఎకరాల్లో మామిడి, 1.5 ఎకరాల్లో కాషియా, 0.5 ఎకరాల్లో జామ, 1.5 ఎకరాల్లో ఉసిరి మొక్కలు నాటడానికి ఐదు మండలాల్లోని 13 గ్రా మాలను గుర్తించడం జరిగిందన్నారు. ఉద్యానవన, అటవీ శాఖల సహకారంతో పెంచేందుకు తోడ్పాటు, జాతీయ ఉపాధి హామీ పథకం, తెలంగాణకు హరిత హారం కింద సహకారం అందించి మొక్కల సంరక్షణ బాధ్యత ఇవ్వడం ద్వారా రైతులు ఆర్థికంగా ఎదుగుతారని అభిప్రాయపడ్డారు. ఆర్‌వోఎఫ్‌ఆర్ భూములను సారవంతం చేసేందుకు జిల్లాలోని గాధిగూడ, ఉట్నూ ర్, ఇంద్రవెల్లి, నార్నూర్, బజార్‌హత్నూర్, మండలాల్లోని 10 గ్రామాలలో 106 ఫాంపాండ్స్ స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఏర్పాటుకు ప్రతిపాదించగా, ఇ ప్పటి వరకు 52 పూర్తయ్యాయని, మిగతావి పురోగతి లో ఉన్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్‌డివో రాజేశ్వర్ రాథోడ్, స్వచ్చంద సంస్థలు ప్రతినిధులు గ్రామీణాభివృద్ది శాఖ సిబ్బంది పాల్గొన్నారు.