Home తాజా వార్తలు ఫెదరర్‌కు అరుదైన గౌరవం

ఫెదరర్‌కు అరుదైన గౌరవం

Roger-Federer

బెర్న్: స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ టెన్నిస్‌లో అత్యంత విజయవంతమైన ఆటగాడిగా పేరొందిన ఫెదరర్‌ను స్విట్జర్లాండ్ అరుదైన గౌరవంతో సత్కరించింది. ఫెదరర్ సాధించిన విజయాలు, వ్యక్తిత్వానికి చిహ్నంగా అత్యంత అరుదైన గౌరవం కల్పించింది. స్విస్‌మెంట్ వెండి నాణేలను రూపొందించాలని స్విట్జర్లాండ్ ప్రభుత్వం నిర్ణయించింది. స్విస్ కరేన్సిలో 20 ఫ్రాన్సీల వెండి నాణేనికి ముందు వైపు ఫెదరర్ బ్యాంక్ హాండ్స్ ఆడుతున్న చిత్రాన్ని ముద్రించారు. ఈ క్రమంలో 55 వేల నాణేలను ముద్రిస్తున్నట్టు స్విస్ ప్రభుత్వం వెల్లడించింది. అంతేగాక వచ్చే ఏడాది మే నెలలో మరో 40 వేల నాణేలను కూడా అందుబాటులోకి తెస్తామని తెలిపింది. ప్రపంచ టెన్నిస్‌కు లభించిన ఆణిముత్యాల్లో ఫెదరర్ ఒకడని, అతన్ని అరుదైన గౌరవంతో సత్కరించడం గొప్ప అనుభూతిని ఇస్తోందని స్విస్ ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది.

Roger Federer gets own Swiss coin