Thursday, April 25, 2024

ఐసిసి ర్యాంకింగ్స్‌: రోహిత్ శ‌ర్మ‌కు కెరీర్ బెస్ట్ ర్యాంక్..

- Advertisement -
- Advertisement -

Rohit Sharma gets Career Best Rank in ICC Test Rankings

దుబాయ్‌: టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ, సీనయర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ లు ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్ లో సత్తా చాటారు. ముఖ్యంగా హిట్ మ్యాన్ రోహిత్ టెస్టు కెరీర్ లో మొదటిసారి అత్యుత్తమ ర్యాంక్ సాధించాడు. తాజాగా ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్ ను ప్రకటించింది. ఇందులో రోహిత్ శర్మ టాప్ 10లోకి దూసుకొచ్చాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న టెస్ట్ సిరీస్‌లో రోహిత్ శ‌ర్మ ఒక భారీ శతకంతోపాటు అర్థ సెంచరీతో రాణించాడు. దీంతో‌, ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్ బ్యాట్స్ మెన్ల జాబితాలో రోహిత్ ఆరు స్థానాలు మెరుగుపర్చుకుని 8వ స్థానంలో నిలిచాడు. దీంతో రోహిత్ తొలిసారి టాప్10లో చోటు దక్కించుకున్నాడు. మరోవైపు కోహ్లీ తన ఐదో స్థానాన్ని కాపాడుకున్నాడు. ఈ జాబితాలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, లబూషేన్ లు రెండు మూడు స్థానంలో నిలిచారు. నాలుగో స్థానంలో ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ ఉన్నాడు. ఇక, బౌలర్ల జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ నాలుగు స్థానాలు ఎగబాకి మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ మొదటి స్థానంలో ఉండగా, నీల్ వాగ్నర్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

 

Rohit Sharma gets Career Best Rank in ICC Test Rankings

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News