Home స్కోర్ రోహిత్ పేరిట చెత్త రికార్డు!

రోహిత్ పేరిట చెత్త రికార్డు!

Rohit-Sharma

న్యూఢిల్లీ: టీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ పేరిట ఓ చెత్త రికార్డు వచ్చి చేరింది. అంతార్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక సార్లు డకౌట్(పరుగులేమి చేయకుండా) అయిన వారి జాబితాలో రోహిత్ అగ్రస్థానంలో నిలిచాడు. సఫారీలతో బుధవారం జరిగిన టీ20లో రోహిత్ డకౌట్ గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. తాను ఎదుర్కొన్న తొలి బంతికే రోహిత్ పెవిలియన్ చేరాడు. ఇప్పటి వరకు మొత్తం నాలుగు సార్లు రోహిత్ పరుగుల ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. రోహిత్ తర్వాత స్థానాల్లో యూసుప్ పఠాన్(3), ఆశిష్ నేహ్రా(3) ఉన్నారు. ఈ నేపథ్యంలో నెటిజన్లు రోహిత్ శర్మపై కామెంట్లు పెడుతున్నారు. బ్యాట్స్ మెన్ ఆఫ్ ది డే.. రోహిత్ శర్మ అనే కామెంట్స్ ఎక్కువ సార్లు కనిపిస్తోంది. హిట్ మ్యాన్ గా పేరొందిన రోహిత్ వన్డే క్రికెట్ లో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్న విషయం విదితమే. మూడుసార్లు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్ మెన్ గా కొనసాగుతున్నాడు రోహిత్. అలాంటి రోహిత్ పేరిట తాజాగా ఈ చెత్త రికార్డు వచ్చి చేరడం గమనార్హం.