Home తాజా వార్తలు రోహిత్ సెంచరీ…. భారత 285/3

రోహిత్ సెంచరీ…. భారత 285/3

 

 

విశాఖపట్నం: దక్షిణాఫ్రికా – భారత జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు 62 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 285 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు టీమిండియా 356 పరుగుల ఆధిక్యంలో ఉంది. రోహిత్ శర్మ దూకుడుగా ఆడి సెంచరీ చేశాడు. రోహిత్ 149 బంతుల్లో 127 పరుగులు చేసి ఔటయ్యాడు. పూజారా 81 పరుగులు చేసి ఫిలాండర్  బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యుగా వెనుదిరిగారు. ప్రస్తుతం క్రీజులో జడేజా (40), విరాట్ కోహ్లీ (20) పరుగులతో ఆటను కొనసాగిస్తున్నారు. సపారీలో బౌలర్లలో మహారాజ్ రెండు వికెట్లు పడగొట్టగా ఫిలండర్ ఒక వికెట్ తీశాడు.

ఇండియా తొలి ఇన్నింగ్స్:  502/7డి

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్: 431 ఆలౌట్ 

 

 

Rohith Century in SA vs Ind Second Innings in Vizag