Friday, March 29, 2024

రోజూ గిల్లే వాడు!

- Advertisement -
- Advertisement -

Roju gille vadu

 

‘కార్తికేయ’ చిత్ర నిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం, టారస్ సినీ కార్ప్ సమర్పణలో ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు దర్శకత్వంలో మాగ్నస్ సినీప్రైమ్ పతాకంపై బాల కుటుంబరావు పొన్నూరి నిర్మిస్తున్న చిత్రం ‘ఆర్జీవీ’ (రోజూ గిల్లే వాడు). శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ చిత్రం టైటిల్ లోగోను విడుదల చేయడంతో పాటు చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేశారు ఫిల్మ్‌మేకర్స్. ఈ సందర్భంగా దర్శకులు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ “తా చెడ్డకోతి వనమెల్లా చెరిచినట్లు… తన పిచ్చి ఇజంతో యువతను పెడత్రోవ పట్టిస్తున్న ఒక వ్యక్తి ఫిలాసఫి మీద సంధించిన రామబాణమే ఈ సినిమా.

శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఈ చిత్రం టైటిల్ లోగోను విడుదల చేయడం జరిగింది”అని తెలిపారు. చిత్ర సమర్పకులు వెంకట శ్రీనివాస్ బొగ్గరం మాట్లాడుతూ “కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిన వెంటనే చిత్రీకరణ ప్రారంభిస్తాము. సామాజిక బాధ్యత లేని ఒక కుహనా మేధావి ఐడియాలజీ సమాజాన్ని ఎలా కలుషితం చేస్తుందో తెలిపేదే ఈ సినిమా” అని చెప్పారు. సురేష్, రాశీ, శ్రద్ధా దాస్, అమిత్, పునర్నవి భూపాలం, తేజ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించే ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : వేదాంత్ మల్లాది, కూర్పు : కార్తీక శ్రీనివాస్, కళ : కృష్ణ చిత్తనూర్, సంగీతం : వీణాపాణి.

 

Roju gille vadu title logo release
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News