Friday, April 26, 2024

దీపావళి కానుకగా…

- Advertisement -
- Advertisement -

Romantic movie release on Nov 04

 

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా కేతిక శర్మ హీరోయిన్‌గా రూపొందుతున్న చిత్రం ‘రొమాంటిక్’. పూరీ జగన్నాథ్ ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కి కథ, – స్క్రీన్‌ప్లే,- డైలాగ్స్ అందించారు. పూరీ శిష్యుడు అనిల్ పాదూరి దర్శకత్వం ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో ఆకాష్, కేతిక శర్మ జంట అందరినీ ఆకట్టుకుంటోంది. సీనియర్ నటి రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో మకరంద్ దేశ్ పాండే, – ఉత్తేజ్, – సునయన ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. లావణ్య సమర్పణలో పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్. పూరీ కనెక్ట్ బ్యానర్స్‌పై ‘రొమాంటిక్’ సినిమా రూపొందుతోంది. పూరి జగన్నాథ్, – ఛార్మి కౌర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News