Thursday, April 25, 2024

హీరో ఆకాష్‌లో ఓ ఫైర్ ఉంది

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో ఆకాష్ పూరి, అందాల హీరోయిన్ కేతిక శర్మ కాంబోలో వస్తోన్న ‘రొమాంటిక్’ చిత్రం ఈనెల 29 విడుదల కాబోతోంది. పూరి కనెక్ట్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు. ‘రొమాంటిక్’ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను వరంగల్‌లో ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, విజయ్ దేవరకొండతో పాటు చిత్ర బృందం పాల్గొంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ “హీరో ఆకాష్‌లో ఓ ఫైర్ ఉంది. అతను ‘రొమాంటిక్’తో సక్సెస్ కొడతాడని నమ్ముతున్నా. ఈనెల 29న వస్తున్న ‘రొమాంటిక్’ మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నా” అని అన్నారు. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ..“రొమాంటిక్ సినిమాను అనిల్ అద్భుతంగా తెరకెక్కించాడు. సెకండాఫ్ చాలా బాగుంటుంది. క్లైమాక్స్ అయితే సూపర్. ఆకాష్, కేతిక, రమ్య ఇరగొట్టేశారు. మంచి ఎంటర్‌టైన్‌మెంట్ కావాలంటే ఈ సినిమా చూడండి”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆకాష్ పూరి, కేతిక శర్మ, ఛార్మి, అనిల్ పాదూరి, సునీల్ కశ్యప్ తదితరులు పాల్గొన్నారు.

Romantic Pre Release Event in Warangal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News