Home తాజా వార్తలు ప్రభుత్వ లాంఛనాలతో రోశయ్య అంత్యక్రియలు

ప్రభుత్వ లాంఛనాలతో రోశయ్య అంత్యక్రియలు

Rosaiah funeral was held at his farm house in kompally

 

దేవరయాంజాల్‌లోని తన వ్యవసాయ క్షేత్రంలో ముగిసిన అంత్యక్రియలు
పరేడ్ నిర్వహించి గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిగిపిన పోలీసులు
చితికి నిప్పంటించిన పెద్ద కుమారుడు శివసుబ్బారావు

మనతెలంగాణ/శామీర్‌పేట: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్, రాజకీయ దురంధరుడు కొనిజేటి రోశయ్య అంత్యక్రియలు ఆదివారం మేడ్చల్ జిల్లా తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవరయాంజాల్‌లోని లిటిల్ ఇంగ్లాండ్ తన వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. గాంధీ భవన్ నుండి రోశయ్య పార్థివదేహాం మధ్యాహ్నం 1.20 గంటలకు వ్యవసాయ క్షేత్రానికి చేరుకుంది. వ్యవసాయ క్షేత్రంలో గంధపు చెక్కలతో పేర్చిన చితిపై రోశయ్య పార్థ్థివ దేహానికి హిందూ సాంప్రదాయ ప్రకారం వేద పండితులు సుమారు రెండు గంటల పాటు వేద మంత్రోచ్ఛరణలతో క్రతువు నిర్వహించారు. అనంతరం పోలీసు అధికారులు లాంఛనంగా పరేడ్ నిర్వహించి గౌరవ వందనం చేశారు. రెండు నిమిషాలు మౌనం పాటించి తుపాకులతో మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం మధ్యాహ్నం 3.49 గంటలకు రోశయ్య పెద్ద కుమారుడు శివ సుబ్బారావు తన తండ్రి చితికి నిప్పటించారు. దీంతో అంతిమ సంస్కారాలు ప్రముఖులు, అధికారుల మధ్య లాంఛనంగా ముగిశాయి.

రోశయ్య అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖుల..
దేవరయాంజాల్‌లోని రోశయ్య వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఎల్లంపల్లి శ్రీనివాస్, పేర్ని నాని, కాంగ్రెస్ నేత కె.వి.పి రాంచంద్రారావు, ఎమ్మెల్యేలు నెంబూరి శంకర్‌రావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్, నిజమాబాద్ ఎమ్మెల్యే గణేశ్‌గుప్త, పోలీస్ హౌ జింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ దామోదర్‌రెడ్డి, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి, మంథని ఎమ్మెల్యే మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, వి.హన్మంత్‌రా వు, మాజీ మంత్రి గీతారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవి ఆంజనేయులు, ఆ మంచి కృష్ణమూర్తి, ఏఐసిసి కార్యదర్శి రుద్రరాజు పద్మరాజు, మాజీ మంత్రి నక్క ఆనంద్‌బాబు, మేడ్చల్ జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ హరీష్, అదనపు కలెక్టర్ నర్సింహ్మారెడ్డి, ఆర్డీఓ రవి, బాలానగర్ డిసిపి పద్మజారెడ్డి, ట్రాఫిక్ డిసిపి విజయ్‌శేఖర్, ఎసిపి పురుషోత్తం, తహశీల్దార్ సురేందర్, తూంకుంట మున్సిపల్ ఇంఛార్జ్ కమీషనర్ సునీత, తూంకుంట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీమిడి జైపాల్‌రెడ్డి, శామీర్‌పేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.శంకర్‌గౌడ్, మూడుచింతలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొమ్మలపల్లి నర్సింహ్మాయాదవ్, మహేందర్‌యాదవ్, మహిపాల్‌రెడ్డి, రోశయ్య కుటుంబ సభ్యులు, పోలీసులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

Rosaiah funeral was held at his farm house in kompally