Home తాజా వార్తలు సమాజంలో పెద్దలకు సముచిత గౌరవం లభించాలి : రోశయ్య

సమాజంలో పెద్దలకు సముచిత గౌరవం లభించాలి : రోశయ్య

Rosaiah

మనతెలంగాణ/హైదరాబాద్ : సమాజంలో పెద్దలకు సముచిత గౌరవం లభించాలని మాజీ గవర్నర్ రోశయ్య పిలుపునిచ్చారు. శనివారం వరల్డ్ ఎల్డర్స్ అబ్యూజ్ అవేర్‌నెస్ డే సందర్భంగా ఎల్డర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అధ్వర్యంలో జరిగిన అవగాహన ర్యాలీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ, పాఠశాల విద్యా విధానంలో పెద్దల పట్ల గౌరవ మర్యాదలు పెంపొంచేలా అవగాహన కల్పించాలని సూచించారు. వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వాల చొరవ మరింత పెరగాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వయోవృద్ధుల సంక్షేమం కోసం చేస్తున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా అభినందించారు. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడు తూ, ప్రభుత్వాలు చట్టాల పరిధిలో వయోవృద్ధుల సంక్షేమం, అభ్యున్నతికి పథకాలను రూపొందించి అమలు చేయాలని కోరారు. రెండు రోజుల పాటు జరిగే వరల్డ్ ఎల్డర్స్ అబ్యూజ్ అవేర్‌నెస్ డే వేడుకల సందర్భంగా శనివారం నెక్లెస్‌రోడ్‌లో సీనియర్ సిటిజన్స్ మౌన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వాలు వృద్ధులకు మరింత చేయూతన్విలని కొరుతూ ప్లే కార్డులను ప్రదర్శించారు.
నేడు భారీ కార్యక్రమాలు
వరల్డ్ ఎల్డర్స్ ఎబ్యూజ్ అవర్‌నెస్ డే సందర్భంగా ఆదివారం ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు వయోవృద్ధుల సంక్షేమార్థం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆహ్వాన కమిటీ చైర్మన్ విజయకుమార్ తెలిపారు. ఎ.వి.కాలేజ్ గ్రౌండ్‌లో ఎల్డర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ,జిహెచ్‌ఎంసీ, హల్పేజ్ ఇండియా, రెడ్ క్రాస్,లైన్ క్లబ్ , అస్రా, సినియర్ సిటిజన్ ఫోరమ్స్, రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్స్ తోపాటు పలు స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో వైద్య శిభిరాలు, క్రిడాపోటీలు, అవగాహన సదస్సులు, సీనియర్ సిటిజన్స్‌కు సన్మానం, సాంస్కృతిక కార్యక్రమాలు, కళలు, చిత్రలేఖనం, కవిత్వం, రచన, ముగ్గులు, వకృత్వం, యోగ తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం కార్యక్రమాలకు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహిమూద్ అలీ, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌లను ఆహ్వానించామని ఆయన తెలిపారు.

Rosaiah participate in yelder club international foundation Rally