Home Default కత్తులతో కేక్ కట్ చేసి కటకటాలపాలైన రౌడీలు

కత్తులతో కేక్ కట్ చేసి కటకటాలపాలైన రౌడీలు

 

చెన్నై: రౌడీలు తమ ఇమేజ్ చూపించుకోవడానికి బర్త్‌డే కేక్‌ను కత్తితో కట్ చేసి జైలు పాలైన సంఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో చోటుచేసుకుంది. శివనంతపురం గ్రామంలో సతీశ్ కుమార్, సుందర్, అథవన్ అనే రౌడీలు బర్త్ డే కేక్‌ను తల్వారీతో కట్ చేశారు. అనంతరం ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారాయి. ఫేస్‌బుక్‌లో ఆ ఫోటోలు కనిపించడంతో డిఎంకె కార్యకర్త సి.శివ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శరవనమ్‌పట్టి ఇన్స్‌పెక్టర్ వి. సెల్వరాజ్ ఆ ముగ్గురు రౌడీలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆ ముగ్గురిపై క్రిమినల్ కేసులున్నాయని పోలీసులు తెలిపారు. గతంలో బిన్ను అనే రౌడీ షీటర్ ను కూడా కేక్ ను తల్వారీతో కట్ చేస్తే పోలీసులు అరెస్టు చేశారు. 

 

Rowdies Cake Cut with Sword after Arrested in TN

 

Rowdies Cake Cut with Sword after Arrested in TN