Home తాజా వార్తలు రౌడీషీటర్ దారుణ హత్య

రౌడీషీటర్ దారుణ హత్య

murder

 సికింద్రాబాద్‌లో పట్టపగలే హత్యకు గురైన ఫరీద్ 

మన తెలంగాణ / సికింద్రాబాద్ : ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సికింద్రాబాద్  రేతిఫైల్ బస్టాండ్ ఎదురుగా ఉన్న వైన్స్ షాప్ పక్కన ఉదయం 9 గంటల ప్రాంతంలో ఫరీద్ అనే రౌడీషీటర్ హత్యకు గురయ్యాడు. విష యం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు ప్రారంభించారు. మాణికేశ్వరీ నగర్‌కు చెందిన ఫరీద్ ఉదయం సికింద్రాబాద్‌లోని రైతిఫైల్ బస్టాండ్ దగ్గరలోని వైన్స్ షాపు దగ్గర ఇతరులతో గొడవకు దిగాడు. మాటా మాటా పెరగడంతో ఫరీద్‌పై దాడి చేసి దారుణంగా హత్య చేశారు. గోపాలపురం ఎసిపి కె.శ్రీనివాస రావు తెలిపిన వివరాల ప్రకారం హత్యకు గురైన వ్యక్తి చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటరని మధ్యం సేవించడానికి వచ్చి అక్కడే ఉన్న ఇతర వ్యక్తులతో గొడవకు దిగడం జరిగిందన్నారు. గతంలో కూడా తాగిన మైకంలో ఇతరులపై దాడులకు దిగేవాడని నేర చరిత్ర కలిగిన ఇతనిపై రౌడీషీట్ తెరిచామన్నారు. హత్యకు గల కారణాలు ధర్యాప్తులో తేలుతాయని ప్రస్తుతం ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. మద్యం సేవించి అక్కడే ఉన్న ఇతర వ్యక్తులతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో ఫరీద్‌పై కర్రలు, కత్తులతో ఆరుగురు వ్యక్తులు దాడి చేశారు. కర్రలు, బండరాళ్లు, కత్తులతో దాడి చేసి చంపేశారు.