Home జగిత్యాల జ‌గిత్యాలలో రౌడీషీట‌ర్ హత్య

జ‌గిత్యాలలో రౌడీషీట‌ర్ హత్య

Rowdy Sheeter murder in Jagtialజగిత్యాల : జ‌గిత్యాల జిల్లా కేంద్రంలోని బీట్ బ‌జార్‌లో ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. హ‌నుమాన్ వాడ‌కు చెందిన రౌడీషీట‌ర్  శేఖ‌ర్‌(35)ను దుండగులు హత్య చేశారు. శుక్రవారం రాత్రి బీట్ బ‌జార్‌లో శేఖ‌ర్‌కు దుండగులు మ‌ద్యం తాగించారు. అనంతరం శేఖర్ పై కత్తితో దాడి చేసి చంపేశారు. పాతకక్షల కారణంగానే శేఖర్ ను హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో కూడా శేఖ‌ర్‌పై హ‌త్యాయ‌త్నం జ‌రిగింది. పోస్టుమార్టం కోసం శేఖర్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.