- Advertisement -
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్వాలిఫయర్ 1 కు అర్హత సాధించింది. ఎకానా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టు లక్నో సూపర్ జెయింట్స్ పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. 228 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది. బెంగళూరు కెప్టెన్ జితేశ్ శర్మ 35 బంతుల్లో 85 పరుగులతో అజేయంగా నిలిచాడు. విరాట్ కొహ్లి 30 బంతుల్లో (54), మయాంక్ అగర్వాల్ 41 పరుగులు చేశాడు.
- Advertisement -