Friday, April 26, 2024

అడవిలో ఆగిన రైలు..

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్  : అటవీ మధ్యలో ఓ రైలు ఆగింది. పోలీసులు హడావుడిగా తనిఖీలు చేస్తున్నారు. అది చూసిన ఓ మహిళ ఆందోళనకు గురయ్యారు. అడవి ప్రాంతంలో రైలు ఆగింది. ఎవరూలేని ప్రదేశం. కిటికిలో నుంచి చూస్తే చీకటి.. వెంటనే పోలీసులు వచ్చారు. అడవి మధ్యలో పోలీసులు రావడం ఏంటి.. తనిఖీలు చేయడమేంటని.. ఓ మహిళ ఆందోళనకు గురైంది. దాంతో గుండెపోటు వచ్చింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. నర్సాపూర్-నాగర్ సోల్ ఎక్స్ ప్రెస్ రైలులో సంధ్య అనే మహిళ ప్రయాణిస్తోంది. సికింద్రాబాద్‌కు చెందిన ఆమె షిరిడీ వెళ్లి.. తిరిగి వస్తోంది. నల్లబెల్లం అక్రమ రవాణా చేస్తున్నారని ఆర్పీఎఫ్ పోలీసులకు సమాచారం వచ్చింది.

పోలీసులు తనిఖీలు చేశారు. విష యం తెలిసిన.. అక్రమ రవాణా చేసే వారు.. అ డవి మధ్యలో చెయిన్ లాగి రైలును ధర్మాబాద్ -బాసర అటవీ ప్రాంతంలో ఆపారు. మరోవైపు పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఈ ఘటనలతో సంధ్య ఆందోళనకు గురైంది. ఆమెకు ఛా తిలో నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలింది. అప్రమత్తమైన సిబ్బంది ఆమెను నిజామాబాద్ రైలే అధికారులకు సమాచారం ఇచ్చారు. నిజామాబాద్ రాగానే.. సంధ్యను అప్పటికే ఏర్పాటు చేసి న అంబులెన్స్‌లో నిజామాబాద్ జిల్లా ప్రభు త్వ జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆందోళనకు గురై అలా జరిగినట్టుగా వైద్యులు తెలిపారు. ప్రస్తుతం సంధ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News